Revanth Reddy : రుణమాఫీపై రేవంత్ రెడ్డి క్లారిటీ.. రేషన్ కార్డు నిబంధన అందుకే

Revanth Reddy : రైతు రుణమాఫీ విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు రుణమాఫీ కోసం రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని విధివిధానాల్లో ఉందని.. దీంతో రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటంటూ తెలంగాణ రైతన్నల నుంచి ప్రశ్నలు తలెత్తడంతో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.

revanth reddy clarifies on ration card link to crop loan waiver

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధనను విధించామని రేవంత్ స్పష్టం చేశారం. రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం రేవంత్ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లరేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికేనని.. రేషన్ కార్డు లేకున్నా కూడా బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న వాళ్లకు రుణ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కలెక్టర్ల సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై అన్ని బ్యాంకులకు సమాచారం అందించాలని.. వెంటనే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023, డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ కానున్నాయి.

Author