Anganwadi : అంగన్ వాడి టీచర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త… ఆసరా పెన్షన్ తో పాటు పదవి విరమణ వయసు పెంపు…!

Anganwadi  : తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ రేవంత్ సర్కార్ ముందుకు వెళుతుంది. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన కొన్ని హామీలను నెరవేర్చటంలో కాస్త సమయం పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా అంగన్ వాడి ఉద్యోగులకు మాత్రం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే….

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేసిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో నడుచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం 6 గ్యారెంటీల పైన చేశారు. ఇక ఈ 6 గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం , రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభం కూడా అయ్యాయి. అంతేకాదు ఇటీవల గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా ప్రారంభించారు. అలాగే రానున్న రోజుల్లో రైతులకు రుణమాఫీ చేసి వారిని కూడా ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ తరుణంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తాజాగా అంగన్ వాడి సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది…

Anganwadi : అంగన్ వాడి టీచర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త... ఆసరా పెన్షన్ తో పాటు పదవి విరమణ వయసు పెంపు...!
Anganwadi : అంగన్ వాడి టీచర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త… ఆసరా పెన్షన్ తో పాటు పదవి విరమణ వయసు పెంపు…!

Anganwadi  : అంగన్ వాడి రిటైర్ మెంట్ వయసు పెంపు…

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు మరియు సహాయకులకు పదవి విరమణ వయసు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంగన్ వాడి టీచర్లు మరియు సహాయకుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అంగన్ వాడి ఉద్యోగులు వారి యొక్క పుట్టిన తేదీని పాఠశాల బోనఫైట్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మెమో ప్రకారం గుర్తించి ఆదేశాల జారీ చేయాలని తెలియజేశారు. ఒకవేళ ధ్రువీకరణ పత్రాలు లేకపోతే సంబంధిత జిల్లాలో గుర్తింపు పొందిన వైద్య అధికారి జారీ చేసిన బోర్డ్ డెన్సిటో మెట్రీ నివేదిక లేదా వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు.

Anganwadi  : ఆసరా పింఛన్లు కూడా…

అదేవిధంగా రిటైర్ మెంట్ అయినటువంటి అంగన్ వాడి ఉద్యోగులకు ఆసరా పింఛన్ కూడా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంగన్ వాడి కేంద్రాలలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి అంగన్ వాడి టీచర్లకు లక్ష రూపాయలు , మినీ అంగన్ వాడి టీచర్లు మరియు సహాయకులకు రూ.50,000 చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అంగన్ వాడి టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts