Rahul Gandhi : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…అసంతృప్తులు ఉన్నారు… ప్రభుత్వం కూలిపోవడం ఖాయం…!

Rahul Gandhi : ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ మరియు బీజేడీలు అతిపెద్ద పార్టీలుగా కొలువుదిరాయి. దీంతో కేంద్రంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా మారింది. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వం బలహీనంగా ఉందని ఎప్పుడైనా కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ పలు రకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా హాట్ టాపిక్ గా మారాయి….

Rahul Gandhi : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు...అసంతృప్తులు ఉన్నారు... ప్రభుత్వం కూలిపోవడం ఖాయం...!
Rahul Gandhi : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…అసంతృప్తులు ఉన్నారు… ప్రభుత్వం కూలిపోవడం ఖాయం…!

అయితే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ గాంధీ అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి గురించి పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ…ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న కూటమిలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుందని తెలియజేశారు. దీని ఫలితంగా కూటమిలోని కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ నేతృత్వంలోని కూటమి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ఏ చిన్న సమస్య అయినా సరే ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో రాహుల్ మాట్లాడుతూ విద్వేషాలను వ్యాప్తి చేసి ఫలితాలను పొంది ఉంటారు కానీ ఈసారి ప్రజలు మాత్రం ఆ ఆలోచన మార్చుకున్నారని తెలిపారు…

ఇది ఇలా ఉండగా గడిచిన 2014 మరియు 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ దక్కించుకుని గెలిచింది. కానీ ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎన్డీయే ప్రభుత్వం కూటమి పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ప్రదర్శనతో దాదాపు 99 స్థానాలను దర్శించుకుంది. ఈ క్రమంలోనే మొత్తం ఇండియా కూటమి 230 సీట్లను సాధించుకున్నాయి.

Author