Andhra Pradesh Elections : ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో నిశ్శబ్ద వాతావరణం… కారణం అదేనా…!

Andhra Pradesh elections  : రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు రాజకీయ నాయకుల ప్రచారాలతో రాష్ట్రమంతా కోలాహోలంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఉండే ఊపే వేరు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలో ఏ రాష్ట్రంలో చూడని విధంగా కనిపిస్తాయి. కానీ అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాలు చాలా చప్పగా కనిపించడం గమనార్హం.

నిజానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రంగా అందరూ చెబుతారు. ఇక ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అందరూ కూడా విలక్షణమైన తీర్పులను ఇస్తూ ఉంటారు. దేశమంతా ఒకదారైతే ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒకదారి అంటూ కూడా చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లొఎన్నికల సర్వేలు కూడా అంచనాలకు అందని విధంగా తీర్పులు ఇస్తుంటాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న లేకపోయినా రాజకీయాలు ఎప్పుడూ కూడా మూడు పొద్దులుగా సాగుతూనే ఉంటాయి. ఇక ఈ రాష్ట్రంలో టీ బడ్డీల దగ్గర నుండి మొదలుపెడితే రచ్చబండల దాకా ప్రతి చోట రాజకీయ చర్చలే కొనసాగుతుంటాయి.

Andhra Pradesh Elections : ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో నిశ్శబ్ద వాతావరణం... కారణం అదేనా...!
Andhra Pradesh Elections : ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో నిశ్శబ్ద వాతావరణం… కారణం అదేనా…!

అంతెందుకు కూరగాయ మార్కెట్లలో చివరికి దేవాలయాలలో కూడా రాజకీయ చర్చలు లేకుండా ముగించరు అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నలుగురు గుమ్మి కూడిన రాజకీయాలు లేకుండా మాటలు కొనసాగమని చెబుతుంటారు. ఈ విధంగా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది.ఇలాంటి రాజకీయ చర్చలు సర్వసాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంటాయి. అలాంటి రాష్ట్రంలో మరో 10 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది.

Andhra Pradesh elections  : నిశ్శబ్ద వాతావరణానికి కారణం

సార్వత్రికి ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో ఇలాంటి వాతావరణం ఏంటి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునే ప్రజలు ఒక్కసారిగా సైలెంట్ అవడంతో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చప్పుడు లేకుండా జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎవరూ కూడా డబ్బులు బయటకు తీసే పరిస్థితి కనిపించడం లేదట. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా డబ్బులు పంచడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీ నాయకులు మాత్రం సైలెంట్ గా ప్రచారాలు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మా ఊరిలో ఊపు రావాలంటే మందు ఉండాల్సిందేనని పలువురు క్యాడర్ కు చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు వినడం లేదని తెలుస్తోంది.

దీంతో కాసుల గలగాల లేకపోవడంతో ఇదేం ఎన్నికలు అంటూ అందరూ అంటున్నారు. ఈ విధమైన వాతావరణం ఉండడంతోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పెద్దగా కనిపించడం లేదు. అంతేకాక రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడం వలన ఎవరి గోల వారిది అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Andhra Pradesh elections : డబ్బే మాట్లాడిస్తుంది…

ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదైనా సరే డబ్బుతోనే సాధ్యమవుతుంది. అలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు మరోలా ఉండడంతో పల్లెలు మూగబోతున్నాయని చెప్పాలి. దీంతో క్యాడర్ సభ్యులు సైతం దిగాలు పడుతున్నారని చెబుతున్నారు. ఈ కారణం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ రచ్చబండ చర్చలు లేవు రాజకీయ గోళలు కనిపించడం లేదు. ఇక ఇప్పటికే ఎన్నికల కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. అయినప్పటికీ ఏపీలో రాజకీయాలు సైలెంట్ గా ఉండడంతో ఎక్కడో తేడా కొడుతుంది భయ్యా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో పరిస్థితులు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది