Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో 2 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ నాయకులు క్షణాన్ని కూడా వృధా చేయకుండా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రచారాలలో పాల్గొంటూ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారాహి విజయభేరి యాత్ర ద్వారా ప్రచారాలను కొనసాగిస్తూ ఇప్పటి కే చాలా ,నియోజకవర్గాలలో నిర్వహించిన బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ హాజరవుతూ వస్తున్నారు.
Pawan kalyan : జగన్ ది ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్…
ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడ వేస్ట్ లో కూడా పవన్ తన ప్రచారాలను ముమరం చేశారు. ఇక ఈ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇటీవల విజయవాడ వెస్ట్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోతిన మహేష్ గురించి వైసీపీ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….కాల్మనీ లో అరెస్ట్ అయిన వ్యక్తులను తీసుకువచ్చి జగన్ దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారని ఏద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడితే బెదిరింపులు మొదలు పెడుతున్నారు. ఒక కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు వైసీపీ నేతలు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. వారి నాటకాలకు ఆస్కార్ అవార్డు సైతం చిన్నబోతుందని తెలిపారు…
నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఆస్కార్ లెవెల్లో నటించడం నాకు రాదని జగన్ గారు మాత్రం ఆ నటనకు పెట్టి పుట్టారని తెలిపారు. అదేంటో రాయిని ఒకవైపు నుండి విసిరితే అది 360 డిగ్రీస్ తిరిగివచ్చి మరోవైపు తగిలింది. వారిది నిజంగా ఆస్కార్ లేసెల్ పర్ఫామెన్స్ అంటూ పవన్ తెలిపారు. నిజంగా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ డ్రైనేజీ విషయానికొస్తే నేను రోడ్ షో చేస్తూ వస్తున్న మార్గమధ్యంలో ఎంత దుర్గంధం ఉందంటే మాటల్లో చెప్పలేను.
ఏదో నేను ఒక్కసారి వచ్చినప్పుడే నాకు ఇలా ఉంటే ప్రతిరోజు మీరు ఇదే పరిసరాల్లో తిరుగుతున్నారు. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి చాలా కష్టతరమైన విషయం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా బాగు చేస్తామని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. మరీ ముఖ్యంగా విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.