Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలుపు దెబ్బ.. అల్లు అర్జున్ అబ్బా వెనక్కి వెనక్కి పోతున్నాడుగా..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలతోనే కాదు ప్రజా నాయకుడిగా కూడా తన ప్రయాణం మోలు పెట్టారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన పదేళ్లకు ఆయన ఊహించిన విధంగా అధికారం చేపట్టారు. అంతకుముందు రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి ఒకచోటే పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. గెలవడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఐతే మెగా ఫ్యామిలీ అంతా పవన్ వెనక జనసేనకు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు.

అల్లు ఫ్యామిలీ కూడా జనసేనకు తమ సపోర్ట్ అందిస్తున్నా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎలక్షన్స్ లో ప్రచారం చేయడం వార్తల్లో నిలిచింది. తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం బన్నీ నధ్యాల వెళ్లాడు. కేవలం పవన్ కోసం ఒక మెసేజ్ మాత్రమే పెట్టాడు. అప్పటినుంచి అల్లు అర్జున్ మీద మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎటాక్ చేస్తున్నారు. అల్లు ఆర్మీ ఎంత పోరాడుతున్నా సరే మెగా ఫ్యాన్స్ ముందు తట్టుకోలేకపోతున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలుపు దెబ్బ.. అల్లు అర్జున్ అబ్బా వెనక్కి వెనక్కి పోతున్నాడుగా..!
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలుపు దెబ్బ.. అల్లు అర్జున్ అబ్బా వెనక్కి వెనక్కి పోతున్నాడుగా..!

Pawan Kalyan  అల్లు అర్జున్ కు టైం కలిసి రావట్లేదు

ఇక మరోపక్క పవన్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి ఇలా దూకుడు చూపిస్తుండగా ఆయన్ను కాదన్న అల్లు అర్జున్ మాత్రం వెనకపడుతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6న రిలీజ్ వాయిదా పడగా అట్లీతో చేయాలనుకున్న సినిమా కాస్త అటకెక్కేసింది. అంతేకాదు త్రివిక్రం కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సుముఖంగా లేడని టాక్. ఈ కారణాలన్నీ పవన్ కి అల్లు అర్జున్ తన ఫుల్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే అన్నట్టు చెబుతున్నారు.

స్వతహాగా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో మెగా ఫ్యాన్స్ ఇచ్చిన బూస్టింగ్ ని మర్చిపోకూడదు. ఐతే ఇప్పుడు అల్లు ఆర్మీగా చెప్పుకుంటున్న వారు కూడా ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ గా ఉన్నవారే. ఈ విషయంపై అల్లు మెగా ఫ్యామిలీ ఒక సంధి కుదుర్చుకుంటేనే కానీ ఫ్యాన్స్ మధ్య ఈ ఫైర్ చల్లారేలా లేదని చెప్పొచ్చు.

Author