Nagababu : వైసీపీ దాడుల‌కి ప్లాన్ చేస్తుంద‌న్న నాగ‌బాబు.. జ‌న‌సైనికుల‌కి ఏం చేయాలో చెప్పిన మెగా బ్ర‌ద‌ర్..!

Nagababu : మ‌రి కొద్ది రోజుల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ రానుంది. ఏయే పార్టీ అధికారంలోకి వ‌స్తుంది, ఏ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంటుంది అనే దానిపై ఇప్ప‌టికే కొంద‌రిలో క్లారిటీ వ‌చ్చేసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జనసైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు… ముఖ్యంగా పిఠాపురం జనసైనికులు, వీరమహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

Nagababu : వైసీపీ దాడుల‌కి ప్లాన్ చేస్తుంద‌న్న నాగ‌బాబు.. జ‌న‌సైనికుల‌కి ఏం చేయాలో చెప్పిన మెగా బ్ర‌ద‌ర్..!
Nagababu : వైసీపీ దాడుల‌కి ప్లాన్ చేస్తుంద‌న్న నాగ‌బాబు.. జ‌న‌సైనికుల‌కి ఏం చేయాలో చెప్పిన మెగా బ్ర‌ద‌ర్..!

Nagababu ఆవేశం వ‌ద్దు..

ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే, వాళ్లలో ఒకరకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు. ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు నా విన్నపం ఏంటంటే… మనం ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలి. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, పోలీసులకు సంపూర్ణంగా సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని గుర్తుచేశారు నాగ‌బాబు. అంతా సైలెంట్ గానే ఉందాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దన్నారు. పోలీసులు, ఈసీకి సహకరిద్దాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడదామంటూ నాగబాబు పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే, ఓడిపోయే వాళ్లు చేసే కవ్వింపు చర్యలకు, అల్లర్లకు ప్రతిస్పందించవద్దన్నారు. అయితే వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంది. ఈ సారి క‌చ్చితంగా మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి వీట‌న్నింటికి జూన్ 4న క్లారిటీ రానుంది.

Author