KTR vs Revanth : రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. కేటీఆర్ ట్వీట్

KTR vs Revanth : ఇవాళ సాయంత్రం లోపు తెలంగాణ రైతన్నల రుణ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడనున్నాయి. 18 జులై సాయంత్రం లోపు లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు డబ్బులు పడనున్నాయి. ఆగస్టు నెలాఖరు లోపు 2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ ప్రక్రియను విడతల వారీగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కారు మోసం చేస్తోందన్నారు.

ktr tweet on crop loan waiver scheme by congress govt

రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు కేటీఆర్. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని పోజులిస్తున్నారు. 40 లక్షలపై చిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు.

2014, 2018 లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేయడంతో పోల్చితే పావు వంతు రైతులకే అర్హత ఉందా? 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించారు. అప్పట్లోనే సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది. 2018 లో అదే లక్ష లోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా వేయగా.. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 37 లక్షలుగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలి. అర్హులైన అందరు రైతులకూ రైతు బంధు విడుదల చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Author