Revanth Reddy : కేటీఆర్ చీర‌క‌ట్టుకొని బస్సు ఎక్కు.. అవ్వా.. రేవంత్ రెడ్డి అలా అనేశాడేంటి?

Revanth Reddy : ప్ర‌స్తుతం ఎల‌క్షన్స్ ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల వేడి పీక్స్‌లో ఉంది. ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులోను విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాల‌ని రేవంత్ రెడ్డి Telangana CM Revanth reddy శ్ర‌మిస్తున్నారు. అయితే గత 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ Congress Party అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగలేదని BRS Party బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కానట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Revanth Reddy : చీర ఎవ‌రు క‌ట్టుకుంటారు..

ఆదిలాబాద్ లో మూతబడిన పరిశ్రమలను తెరిపిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈనెల 9 లోపు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని కూడా రేవంత్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని కుట్ర చేస్తున్నారన్నారని బీజేపీ, బీఆర్ఎస్‌లపై మండిపడ్డారు.

Advertisement
Revanth Reddy : కేటీఆర్ చీర‌క‌ట్టుకొని బస్సు ఎక్కు.. అవ్వా.. రేవంత్ రెడ్డి అలా అనేశాడేంటి?
Revanth Reddy : కేటీఆర్ చీర‌క‌ట్టుకొని బస్సు ఎక్కు.. అవ్వా.. రేవంత్ రెడ్డి అలా అనేశాడేంటి?

6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్‌నే రివర్స్‌ కౌంటర్‌గా వేశారు కేటీఆర్. ‘రేవంత్ రెడ్డి.. చీర నువ్వు కట్టుకుంటావా? లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా?’ అంటూ మాస్ కౌంటర్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ. 2,500 వస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను పేర్కొంటూ.. నెలకు రూ. 2,500 ఎక్కడ ఇస్తున్నారు? చూపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? అంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటీఆర్..‘రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? అంటూ పంచ్ లు వేశారు..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday