Kiraak RP : సుధీర్ ఆదితో పోలిస్తే నీ బతుకెంత రోజా… వాళ్లకున్న ఫాలోయింగ్ నీకు ఉందా… కిరాక్ ఆర్పీ…!

Kiraak RP : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రచారాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ ఆర్టిస్టులు సినీ సెలబ్రిటీలు పలువురు ప్రచారాలలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రోజా మాట్లాడుతూ జబర్దస్త్ ఆర్టిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రోజూ మాట్లాడుతూ జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్నవారని , వారివి చిన్నచిన్న జీవితాలని , వారివి చిన్న చిన్న ప్రాణాలని తెలిపారు. అంతేకాక సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసమే వారంతా కూడా పవన్ కళ్యాణ్ తరఫున నిలబడ్డారని అంతేకాక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది పెద్ద ఫ్యామిలీ మరియు ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి వారికి అనుకూలంగా నడుచుకోకపోతే రాబోయే రోజుల్లో వారికి అవకాశాలు రావేమో అనే భయంతోనే వాళ్లంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారని రోజా తెలియజేశారు. అయితే తాజాగా రోజా వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ఎవరు ఊహించని విధంగా రోజాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు……

Kiraak RP :  నువ్వేమైనా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అనుకుంటున్నావా…?

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ…జబర్దస్త్ ఆర్టిస్ట్ లపై రోజా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ…మమ్మల్ని గౌరవిస్తే మేము కూడా గౌరవంగా మాట్లాడుతాం. మమ్మల్ని ఒరేయ్ తోరే అంటే మేము కూడా రోజా గారు కాకుండా రోజా అనే పిలుస్తాం. మమ్మల్ని గౌరవించనప్పుడు రోజా అనే పిలుస్తాను. ఇక ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ లు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తున్నారు. వాళ్లందరివి చిన్న చిన్న ప్రాణాలట, చిన్నచిన్న ఆర్టిస్ట్ లటా మరి ఆమె ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా అంటూ కిర్రాక్ పార్టీ ఎద్దేవ చేశారు. ఆ యువరాణి ఏమైనా 10 ఆస్కార్ అవార్డు గెలిచిందా…ఇవన్నీ ఆమెకెందుకు. జబర్దస్త్ ఆర్టిస్టులు అనేవారు వారికి నచ్చిన వారికి మద్దతు తెలుపుతూ వారేదో చేస్తున్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానం కాబ్బటి చేస్తున్నారని తెలిపారు.

Kiraak RP : సుధీర్ ఆదితో పోలిస్తే నీ బతుకెంత రోజా... వాళ్లకున్న ఫాలోయింగ్ నీకు ఉందా... కిరాక్ ఆర్పీ...!
Kiraak RP : సుధీర్ ఆదితో పోలిస్తే నీ బతుకెంత రోజా… వాళ్లకున్న ఫాలోయింగ్ నీకు ఉందా… కిరాక్ ఆర్పీ…!

మమ్మల్ని చిన్నచిన్న ప్రాణులని సంబోధిస్తున్నారు కదా గెటప్ శీను వేసిన క్యారెక్టర్ లో ఒక్క క్యారెక్టర్ అయిన నువ్వు చేయగలవా , నీకు అంత దమ్ముందా అంటూ ఆర్పీ రోజాను నిలదీశాడు . ఇక సుధీర్ గాడు మొదట్లో మ్యాజిక్ చేస్తూ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు వాడికి నీ కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వాడితో నువ్వు పోటీ పడగలవా అంటూ ఆర్పీ రోజు ను నిలదీశాడు. ఇక ఆది విషయానికొస్తే వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్ర మారిపోయింది. వాడి ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు వాడితో నువ్వు పోటీ పడగలవా. వాళ్లెవరు నిన్ను ఏమీ అనకుండా వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు.

కాని నువ్వు ఎందుకు మధ్యలో వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నీకేం అవసరం అంటూ కిరాక్ ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈసారి వైసీపీ తరఫున ఫస్ట్ ఓడిపోయే సీటు మా యువరాణి రోజాదే అంటే ఆర్పి ఎద్దేవా చేశారు. దీంతో ప్రస్తుతం ఆర్పీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts