Politics : రాజకీయాల్లో ఒక సామాన్యుడు పరిస్థితి ఇది… ఈ పరిస్థితి మారాలంటే…!

Politics : ఇండియన్ పాలిటిక్స్ Indian Politics లో ఒక సామాన్యమైన వ్యక్తి జడ్పిటిసి గా గెలిచి ఆ తరువాత ఎమ్మెల్యే, ఎంపీ , సీఎం ఆ తర్వాత పీఎం అయ్యే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పిస్తుంది. అయితే గడిచిన వంద సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ నాయకులు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మన హక్కులను మనకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. మనకి ఏదైనా సమస్య వస్తే అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ దేశాన్ని పాలించేది రాజకీయ నాయకులు కావచ్చు కానీ అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే మొత్తాన్ని నడిపిస్తుంది. కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఎలా కంప్లైంట్ ఇవ్వాలి , జరగని పనులను ఎలా చేపించుకోవాలి అనే ఒక ప్రాసెస్ నీ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజలకు కనిపించకుండా చేశారు.

అలా ఈ పని కేవలం నా వలన మాత్రమే అవుతుందని ఒక రాజకీయ నాయకుడు వచ్చి నా వెనకే నిలబడాలని ప్రజలను కోరుతున్నారు. ఈ విధంగా బానిసత్వాన్ని చేపట్టే ఒక కార్యక్రమాన్ని రాజకీయ నాయకులు చేపడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయమని అడుగుతున్నారు. దాంతో పాటుగా వీళ్ళు మన పార్టీ వాళ్ళ కాదా.. వీళ్ళు మనకు ఓటు వేశారా లేదా అని వివరాలు కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఓటు వేయకపోతే వారు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. నాకు ఓటేయ్యని వ్యక్తులకు నేను ఏమీ చేయను అనే అంశాన్ని ముఖం మీద చెప్పేస్తున్నారు రాజకీయ నాయకులు.

Politics : రాజకీయాల్లో ఒక సామాన్యుడు పరిస్థితి ఇది... ఈ పరిస్థితి మారాలంటే...!
Politics : రాజకీయాల్లో ఒక సామాన్యుడు పరిస్థితి ఇది… ఈ పరిస్థితి మారాలంటే…!

Politics : రాజకీయాలలో సామాన్యుడి స్థాయి…

దీంతో ఒక కామన్ మ్యాన్ ముందుకు రాలేని పరిస్థితి వచ్చింది .అదేవిధంగా మీడియా కూడా కామన్ మాన్ కి సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా న్యూస్ రాస్తూ వారి టిఆర్పీలను పెంచుకుంటున్నారు. అలా కామన్ మ్యాన్ ఏదైనా మంచి పని చేసిన రాజకీయలోకి రావాలి అనుకున్న వారికి ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. దీనివలన ఒక సాధారణ వ్యక్తి రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. దీంతో కామన్ మ్యాన్ ని రాజకీయ నాయకులు ఒక ఓటుగా మాత్రమే చూస్తున్నారు. అంతేకానీ వీళ్ళకున్న సమస్యలేంటి వాటిని తీర్చుదాం .? దాని ద్వారా వారి మనసును గెలుచుకుందాం అనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి లేదు. ప్రస్తుతం కొన్ని పనులు చేసి వారిని మన బానిసలుగా చేసుకుందాం..? లేదా రాజకీయ నాయకుడు లేకపోతే ప్రజలకు గడవదు అనే పరిస్థితి తీసుకొద్దాం దాని ద్వారా ఓట్లు వేయించుకుందాం అనే ఆలోచనలోకి వెళ్లిపోతున్నారు. అయితే ఒక కామన్ మాన్ కంటే కూడా విపరీతమైన పరిస్థితులు ఉన్నది దళితులు మహిళలకే. మరో తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే రాజకీయంలో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో వాళ్లకి ఇస్తారు.

Politics : రాజకీయాల్లో ఒక సామాన్యుడు పరిస్థితి ఇది... ఈ పరిస్థితి మారాలంటే...!
Politics : రాజకీయాల్లో ఒక సామాన్యుడు పరిస్థితి ఇది… ఈ పరిస్థితి మారాలంటే…!

ఈ విధంగా కొంతమంది అయితే గెలిచారు కానీ గెలిచిన తర్వాత వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా మారిపోతారు. నెపోటిజం చూపిస్తారు. తమ పిల్లల్ని మళ్ళీ ఏ రకంగా రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి..?వాళ్ళని ఎలా గెలిపించాలి.? అనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. సామాన్యుడి పార్టీ అని హెడ్డింగ్ పెట్టుకుని ఈరోజు స్కామ్ లు చేసి జైల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ విధంగా రాజకీయాలలో కామన్ మ్యాన్ కి స్కోప్ లభించడం లేదు. సమాజంలో జరుగుతున్న అన్యాలను ప్రశ్నించడం తప్ప. ఈ విధంగా ఒక సాధారణ వ్యక్తి రాజకీయ నాయకుడికి ఓటు వేసే వాడిగా మిగిలిపోతున్నాడు తప్ప రాజకీయాల్లో ఎదగలేని పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి…దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది