Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మనిషి అయ్యారు. ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావించి ఆయన ఏపీని పాలిస్తున్నారు. తనను గెలిపించి, ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం అన్ని రకాలుగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అన్నట్టుగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. వాళ్లు ఎక్కడ ఉన్నా వాళ్లను స్వయంగా కలిసి వాళ్లకు భరోసా ఇస్తున్నారు.
వాళ్ల సమస్యలను తీర్చుతామని హామీ ఇస్తున్నారు. అలా మరోసారి ప్రజల పట్ల తనకు ఉన్న సహృదయాన్ని చాటుకున్నారు. ఏపీ సచివాలయానికి కాన్వాయ్ తో వెళ్తున్న చంద్రబాబును చూసిన ప్రజలు ఆపాలని, తమ సమస్యలను వినాలని కోరగా వెంటనే తన కాన్వాయ్ ని ఆపి మరీ వాళ్ల సమస్యలను విన్నారు చంద్రబాబు.
ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. సీఎం ఆ మార్గం నుంచి వెళ్తారని తెలిసి.. తమ సమస్యలను స్వయంగా సీఎంకే చెప్పుకోవాలని ప్రజలు తమ వినతి పత్రాలతో రోడ్డు మీద నిలబడ్డారు. రోడ్డు మీద ప్రజలను చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపారు. తమ సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.