Chandrababu : అమిత్ షా ఆఫర్.. చంద్రబాబు వద్దనడానికి కారణం ఇదేనా..?

Chandrababu : ఏపీలో కూటమి విజయం కేవలం రాష్ట్ర రాజకీయాలనే కాదు కేంద్ర రాజకీయాల్లో కూడా బలంగా మారేలా చేశాయి. ఎన్.డి.ఏ ప్రభుత్వం నిలబడడానికి టీడీపీ జనసేన ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా చంద్రబాబు కెపాసిటీ ఏంటన్నది ఎన్.డి.ఏ ప్రభుత్వానికి బాగా అర్ధమైంది. అందుకే ఈసారి కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి పనైనా ఈజీగా చేసేలా కార్యచరణలు చేస్తున్నారు. పదేళ్లుగా వెనకపడిన ఏపీని మళ్లీ గాడిలో పెట్టేలా మార్గ దర్శకాలను చేస్తున్నారు చంద్రబాబు.

Chandrababu : అమిత్ షా ఆఫర్.. చంద్రబాబు వద్దనడానికి కారణం ఇదేనా..?
Chandrababu : అమిత్ షా ఆఫర్.. చంద్రబాబు వద్దనడానికి కారణం ఇదేనా..?

ఈ టైం లో ఎన్.డి.ఏ తనకు ఇస్తున్న ఆఫర్లను కూడా పక్కన పెట్టేస్తున్నారు. 2014 లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుని ఎన్.డి.ఏ ముందు తన డిమాండ్ లను పెట్టిన బాబుకి వాళ్లు అప్పుడు కాస్త అడ్డు పడ్డారు. కానీ మళ్లీ పదేళ్ల తర్వాత ఒకరి అవసరం మరొకరికి వచ్చింది. ఐతే ఇప్పుడు చంద్రబాబు అడిగింది కాదనే పరిస్థితి లేదు. అందుకే ఆయన ఏది కావాలన్నా చేసేలా ఎన్.డి.ఏ ప్రభుత్వం రెడీగా ఉంది.

అంతేకాదు లేటెస్ట్ గా లోక్ సభ స్పీకర్ గా చంద్రబాబుకి ఆఫర్ ఇచ్చారట. డైరెక్ట్ గా అమిత్ షా బాబుకి ఫోన్ చేసి స్పీకర్ పదవి తీసుకుంటారా అని అడీఅరట. కానీ చంద్రబాబు అమిత్ షా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. ఇదివరకులా తొందరపడటం కాకుండా ఏపీ అభివృద్ధికి ఏది అవసరమో దాన్ని మాత్రమే చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అంతేకాదు పవర్ మన చేతిలో ఉంది కాబట్టి చక్కదిద్దాల్సిన అంశాల మీద ఫోకస్ చేస్తున్నారట.

తను లోక్ సభ స్పీకర్ గా వెళ్తే ఏపీ మళ్లీ గాడి తప్పుతుంది. అందుకే ఆ ఆఫర్ ని కాదని ఏపీకి కావాల్సిన ఆర్ధిక సాయం ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడుతున్నారట చంద్రబాబు. సో రాబోయే ఐదేళ్లలో ఏపీకి కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. ఆ ఐదేళ్లు ఏపీని అభివృద్ధి బాటలో నడిపించి నెక్స్ట్ టర్మ్ ఏదైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేలా చంద్రబాబు ప్లానింగ్ ఉన్నట్టు అర్ధమవుతుంది.

Author