KCR : తెలంగాణ రాష్ట్రంలో Telangana ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం డీల పడిన బీఆర్ఎస్ BRS Party అధినేత కేసిఆర్ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయానికి తిరిగి జనంలోకి రావడం జరిగింది. దీనిలో భాగంగా కేసీఆర్ నిర్వహించిన బస్సు యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దీంతో పార్టీకార్యకర్తలలో కూడా మరింత జోష్ పెరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ మరింత డీల పడినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాలకు ముందు ఒక్కసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత నుండి ఇప్పటివరకి పార్టీ కార్యాలయానికి వచ్చింది లేదు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ మొత్తం క్షేత్రస్థాయిలో డీల పడిపోయింది. రాష్ట్ర నాయకత్వమే ఇలా ఉంటే ఇక తాము ఎలా పనిచేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు బయటకు వచ్చి కొంత హడావిడి చేస్తున్నప్పటికీ కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు మాత్రం హాజరు కావడం లేదు. దీంతో ప్రస్తుతం పార్టీ క్యాడర్ మొత్తం కేసీఆర్ పర్యటన చేయాలంటూ బలంగా కోరుకుంటున్నాయి. పార్టీ క్యాడర్ లో భరోసా నింపేందుకు ఆయన కచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు.
KCR స్థానిక ఎన్నికలకు…
అయితే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా వారి సత్తా చాటెందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకుంటూ వస్తుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెనక పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి గల ముఖ్య కారణం క్షేత్రస్థాయిలో అధినాయకత్వం బలంగా లేకపోవడమే. కావున కేసీఆర్ పర్యటన చేస్తూ కేడర్ కు భరోసా ఇస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రజా సమస్యలపై కేసీఆర్ క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగితే కాస్త ఫలితాలు మారే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాను. అంతేకాక భవిష్యత్తులో పార్టీ బలంగా ఉండాలంటే కేసీఆర్ తీరు మార్చుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు గ్రామ మండల జిల్లా స్థాయి నేతలు పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలలో చేరారు. ఎందుకంటే వారి భవిష్యత్తు అక్కడ ఉంటేనే సురక్షితంగా ఉంటుందనేది వారి భావన. ఇలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ క్యాడర్ తో సమన్వయం కాకుండా దూరంగా ఉంటే కెసిఆర్ నాయకత్వంపై నమ్మకం పెట్టుకున్న నాయకులు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. కావున కేసీఆర్ త్వరగా మేల్కొని పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.