BJP : Telangana బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి చుట్టూ కొత్త చ‌ర్చ‌.. హైక‌మండ్ నిర్ణ‌యంపై కేడ‌ర్‌లో చ‌ర్చ‌

BJP : ఈ సారి తెలంగాణ‌, ఏపీ రాజ‌కీయాలు ఎంత ర‌క్తి క‌ట్టించాయో మ‌నం చూశాం. రెండు రాష్ట్రాల‌లోను మార్పు కోరుకోవ‌డంతో కొత్త ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి. మ‌రోవైపు తెలంగాణ‌లో బీజేపీ ప‌ట్టు బిగించే ప్ర‌య‌త్నం చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు దిల్లీలో ఉండి లాబీయింగ్​ చేస్తుంటే పార్టీ శ్రేణుల్లో అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్​లకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​కు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

BJP : Telangana బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి చుట్టూ కొత్త చ‌ర్చ‌.. హైక‌మండ్ నిర్ణ‌యంపై కేడ‌ర్‌లో చ‌ర్చ‌
BJP : Telangana బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి చుట్టూ కొత్త చ‌ర్చ‌.. హైక‌మండ్ నిర్ణ‌యంపై కేడ‌ర్‌లో చ‌ర్చ‌

BJP అధ్య‌క్ష ప‌దవిపై అంద‌రి క‌న్ను..

తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 8 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌)తో పాటు బండి సంజయ్‌ (కరీంనగర్‌), రఘునందన్‌ రావు (మెదక్‌), ఈటల రాజేందర్‌ (మల్కాజిగిరి), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), గోడం నగేశ్‌(ఆదిలాబాద్‌), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎంపీలుగా విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది.

ఈటల రాజేందర్ తెలంగాణలో మంచి పట్టున్న నేత. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారు. 3 లక్షల 91వేల పైచిలుకు భారీ మెజారిటీతో లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, తొలుత ఈటలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని తొలుత అంతా భావించారు. అనూహ్యంగా మారిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర క్యాబినేట్‌కు ఎంపికయ్యారు. ఈటలతో పాటు డీకే అరుణ, ధర్మపురి అరవింద్‌కు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న వార్తలు వినిపించినా అలా జరగలేదు. వీరిలో ఎవ‌రో ఒక‌రికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ద‌శాబ్ధాలుగా పార్టీని అంటి పెట్టుకున్న వారికి ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్నార‌ట‌. మాజీ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు పార్టీ పెద్ద‌ల‌ని క‌లిసి ఈ విష‌యంలో సీరియ‌స్‌గా డిస్క‌స్ చేశార‌ట‌. మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారావు,ఆచారి,మ‌నోహార్ రెడ్డి లాంటి నేత‌లు కూడా రేసులో ఉన్నార‌ట‌. చూడాలి మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో..!

Author