Tejaswini : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాల కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ శక్తి పేరుతో నారీమణులు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హిందూపురం నియోజకవర్గం లో బుధవారం రోజు ఏర్పాటు చేసినటువంటి స్త్రీ శక్తి సమావేశంలో నారా బ్రాహ్మణి తో పాటు బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర మరియు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
Tejaswini : మీ ప్రేమను పొందడానికే ఇంత దూరం వచ్చా…
2014లో నాన్నగారు తొలిసారి పోటీ చేసినప్పుడు నేను హిందూపూరంకు రావడం జరిగింది. ఆ తర్వాత 2019లో కూడా హిందూపూరం కు వద్దామని అనుకున్న కానీ ఆ సమయంలో నా భర్త భరత్ కూడా పోటీ చేయడంతో రాలేకపోయాను. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో నా భర్త పోటీ చేస్తున్నప్పటికీ రెండు రోజులు బ్రేక్ తీసుకుని మరి ఇక్కడ వారిని ఎలాగైనా కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అప్పుడు చూపించిన ప్రేమ నేను ఇంకా మర్చిపోలేదు. అప్పటికి ఇప్పటికి మీ ప్రేమ అదే విధంగా ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువ కనిపిస్తుంది. దానికి గాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక హిందూపురం నియోజకవర్గానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తేజస్విని తెలియజేశారు.
Tejaswini : భవిష్యత్తు మీ చేతుల్లో…
ఎన్నికల సమయం రానే వచ్చింది. భవిష్యత్తు గురించి ఆలోచించుకుని ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను తేజస్విని కోరింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ అని , అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తేనే జీవితంలో పైకి రాగలమని తేజస్విని తెలియజేశారు. సంక్షేమ పథకాలు ఉంటే ఈరోజు బాగుంటుంది కానీ భవిష్యత్తులో నేటి యువత భవిష్యత్తు బాగుపడాలన్న రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యమని తేజస్విని తెలియజేశారు. అయితే రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేపాన్ని ఒకేసారి అందించగల ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు ఓటు వేసి ముఖ్యమంత్రి చేయడం మనందరి బాధ్యత అని తేజస్విని వ్యాఖ్యానించారు.
అలాగే హిందూపురం ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డ నందమూరి బాలకృష్ణను మరోసారి గెలిపించాలని తేజస్విని ఓటర్లను కోరారు. ఈ ప్రాంతంలో బాలకృష్ణ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని , మరీ ముఖ్యంగా నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తూ నీటి సమస్య తీర్చారని, అలాగే పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇకముందు కూడా ఇలాంటి ఎన్నో ఉపయోగపరమైన పనులను బాలకృష్ణ చేస్తారని అందుకు సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఆయన గెలిపిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. దీంతో ప్రస్తుతం తేజస్విని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.