Astrology : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారనేది అర్థం కాకపోయేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందే కొన్ని సర్వేలు వచ్చేస్తున్నాయి. అవి కొంత మేరకు నమ్మదగినవిగా ఉండేవి. కానీ వాటి తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఇవి ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని చాలా వరకు కచ్చితంగానే చెప్పేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు అంటే జూన్ 1న సాయంత్రం వరకు ఆగాల్సి వచ్చింది.
Astrology జ్యోతిష్యులు తెరమీదకు..
అయితే ఎన్నికల సంఘం రూల్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయిపోయే వరకు రావొద్దు. ఈ క్రమంలోనే జ్యోతిష్యులు తెరమీదకు వచ్చేశారు. వారికి ఎలాంటి రూల్స్ వర్తించవు కాబట్టి.. వారు తమ జ్యోతిష్యం ప్రకారం ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అనేది వారు చెప్పేస్తున్నారు. గతంలో వారు కొందరి విషయాల్లో చెప్పినవి నిజం కావడంతో వారు చెప్పే జ్యోతిష్యాలకు చాలా విలువ దక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారిని పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు ఎటువైపు ఉన్నారనేది చూద్దాం.
తూర్పు గోదావరి జిల్లాల్లోనే ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరు గాంచిన అమలాపురానికి చెందిన ఉపదృష్ట నాగాదిత్య ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జోతిష్యం చెప్పారు. ఆయన వంశపార పర్యంగా జ్యోతిష్యం చెబుతున్నారు. ఆయన ఏపీలో కూటమికి 135 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీకి ఎదురీత తప్పదని తెలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఫేమస్ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి కూడా వైసీపీదే విజయం అని మొదటి నుంచి చెబుతున్నారు.
ఇలా ఎవరికి తోచింది ఇప్పటి వరకు వారు చెప్పారు. అయితే ఇందులో ఏది నిజం అవుతుంది అనేది మాత్రం జూన్ 4న తెలియబోతోంది. చూడాలి మరి జ్యోతిష్యానికి ఎంత పవర్ ఉందనేది.