AP Public Talk : ఏపీ ప‌బ్లిక్ టాక్‌.. ఈసారి ఆ పార్టీనే గెలుస్తుంది.. వాళ్ల‌కు ఓటు వేసేదెలేదంటున్న ఈ పెద్దాయ‌న‌..!

AP Public Talk  : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇక ఈ రాజకీయాలలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాలను కొన్ని సంస్థలు పలు రకాల సర్వేల ద్వారా కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొందరు పబ్లిక్ టాక్ అంటూ సాధారణ మనుషులను ఇంటర్వ్యూ చేస్తూ వారి నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ఎవరి విజయం సాధిస్తారనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పాలకొల్లు నియోజకవర్గం లో ఓ మీడియా సంస్థ ఓటర్ల వద్దకు వెళ్లి పాలకొల్లు నియోజకవర్గంలో గల రాజకీయ పరిస్థితులను , ఎవరు గెలుస్తారనే విషయాలను తెలుసుకున్నారు…

Advertisement
AP Public Talk : ఏపీ ప‌బ్లిక్ టాక్‌.. ఈసారి ఆ పార్టీనే గెలుస్తుంది.. వాళ్ల‌కు ఓటు వేసేదెలేదంటున్న ఈ పెద్దాయ‌న‌..!
AP Public Talk : ఏపీ ప‌బ్లిక్ టాక్‌.. ఈసారి ఆ పార్టీనే గెలుస్తుంది.. వాళ్ల‌కు ఓటు వేసేదెలేదంటున్న ఈ పెద్దాయ‌న‌..!

AP Public Talk  టీడీపీ దే పైచేయి…

ఈ నేపథ్యంలోనే ఓటర్స్ ను ప్రశ్నించగా పాలకొల్లు నియోజకవర్గం లో కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో గవర్నమెంట్ ఏదొస్తుంది అనేది చెప్పలేము కానీ పాలకొల్లులో కచ్చితంగా టీడీపీ వస్తుందని తెలిపారు. అయితే దానికి గల కారణం ఏంటి అని విలేకరు ప్రశ్నించినప్పుడు.. దానికి సమాధానం ఇస్తూ..ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా రకాల సేవలు చేస్తూ ఉంటారు. అంతేకాక ఫౌండేషన్ లను కూడా నడిపిస్తాడు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అండగా నిలబడతాడు కాబట్టి ఆయనపై ప్రజల్లో మంచి నమ్మకం ఉందని కావున పాలకొల్లు నియోజకవర్గంలో కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని మరోసారి నిమ్మల రామానాయుడు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని తెలియజేస్తున్నారు.

Advertisement

AP Public Talk  పాలకొల్లు అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యం…

అంతేకాక పాలకొల్లు నియోజకవర్గం అనేది టీడీపీ హయాంలోనే అభివృద్ధి సాధించిందని తెలియజేస్తున్నారు. రోడ్ల పరంగా రైల్వే పరంగా టీడీపీ వలనే కాస్త మంచి జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే పాలకొల్లు నియోజకవర్గం లో ఇప్పటికే రామానాయుడు గారు రెండుసార్లు గెలుపొందగా ఇప్పుడు మూడోసారి కూడా రామానాయుడు గారు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఆ ప్రాంతీయ ఓటర్లు తెలియజేస్తున్నారు. అంతేకాక పాలకొల్లు నుండి వైసీపీ అభ్యర్థి స్ట్రాంగ్ కాండిడేట్ ఎవరూ లేరని అందుకే మళ్ళీ రామానాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts