AP Volunteer : ప్రభుత్వం ఏం చేయబోతుంది..? వాలంటీర్ల భవిష్యత్ ఏంటి..?

AP Volunteer : గత ఐదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి ప్రజల మధ్య వ్యక్తిగా వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు అన్నీ ప్రజలకు అందేలా నియమించారు. ఐతే ఎన్నికల నోటిఫికేషన్ టైం లోనే కొందరు వాలంటీర్లు తమ జాబ్ రిజైన్ చేసి వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు 60 వేల మంది ఇలా చేయగా మరో లక్ష మంది ఎలక్షన్ టైం లో వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

AP Volunteer : ప్రభుత్వం ఏం చేయబోతుంది..? వాలంటీర్ల భవిష్యత్ ఏంటి..?
AP Volunteer : ప్రభుత్వం ఏం చేయబోతుంది..? వాలంటీర్ల భవిష్యత్ ఏంటి..?

ఐతే అప్పటి అధికార పార్టీ బలవంతం మీదనే అలా రిజైన్ చేశామని కూటమి గెలిచాక చెబుతున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు. దీనిపై కేసు హైకోర్టులో నడుస్తుంది. ఐతే హైకోర్టు కూడా వీరిపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వమే అని చెప్పకనే చెబుతుంది. తాజాగా జరిగిన చర్చల ప్రకారం ఏపీ ప్రభుత్వం, ఈసీ నుంచి అఫిడవిట్లు కావాలని ఆ నివేదిక ప్రకారమే వాలంటీర్ల భవితవ్యం ఉంటుందని హైకోర్ట్ చెప్పింది.

అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే వాలంటీర్ల భవితవ్యం ఉందని చెప్పొచ్చు. ఐతే ఇప్పటికే వాలంటీర్లతో కాకుండా పెన్షన్స్ ని సెక్రటేరియట్ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఓ పక్క వాలంటీర్లు అంతా కూడా ప్రభుత్వం తమపై పెద్ద మనసు చేసుకోవాలని నేతలను కలిసి తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.

అసలైతే ప్రభుత్వం చేత నియమించబడిన వాలంటీర్లను అంత త్వరగా తీసే అవకాశం లేదు కానీ వాళ్లంతట వారే రిజైన్ చేశాక ప్రభుత్వం వారిని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుందా లేదా అన్నది చూడాలి. హైకోర్ట్ కూడా వాలంటీర్ల విషాంలో ప్రభుతం నిర్ణానికే వదిలేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని చెప్పినట్టుగా ఈ సమన్యాయం వాలంటీర్ల మీద కూడా జాలి పడి అదే న్యాయం చేసేలా వాళ్లను తిరిగి జాబ్ లో జాయిన్ అయ్యేలా చేస్తుందా లేదా రిజైన్ చేసింది వాళ్లే కదా అని వదిలేస్తుందా అన్నది చూడాలి.

Author