Exit Polls : ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయ్.. వాటికి అసలు సరైన ఆధారం ఉందా..?

Exit Polls : రాజకీయాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తాయి. అంతకు ముందు సర్వేల పేరుతో అనేక ఫలితాలు వస్తాయి. కానీ కౌంటింగ్ కు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అవసరమా అనే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత రెండు రోజులు ఆగితే ఎలాగూ అసలైన రిజల్ట్ వస్తుంది కదా మళ్లీ ఈ ఎగ్జిట్ పోల్స్ అవసరమా అనే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వాటి గోల వాటిదే. ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం అటు మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కోట్లలో ఖర్చు చేస్తుంటాయి.

Exit Polls : ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయ్.. వాటికి అసలు సరైన ఆధారం ఉందా..?
Exit Polls : ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయ్.. వాటికి అసలు సరైన ఆధారం ఉందా..?

Exit Polls అనుకూలంగా రాకపోతే..

ఇప్పుడు ఏపీలో ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరిగా వన్ సైడ్ వార్ లేదు. ఈ సారి టఫ్ ఫైట్ నడిచింది. ఢీ అంటే ఢీ అన్నట్టే కూటమికి వైసీపీకి మధ్య పోరు నడిచింది. కాబట్టి ఆ పోరులో గెలిచింది ఎవరో తెలుసుకోవాలనే ఆతృత అందరికీ ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన పనిలేదని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే ఇదే నినాదం ఎత్తుకుంటాయి. ఇప్పుడు ఏపీలో పోలింగ్ నాడు ఓటరు నాడీని పట్టుకోవడంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ పనితనం ఉంటుంది. అయితే ఈ సారి ఓటరు తీరు చాలా భిన్నంగా ఉంది.

ఓటింగ్ లో సైలెంట్ వేవ్ కనిపించింది. ఆ వేవ్ ఎవరిని ముంచుతుందో.. ఎవరిని తేల్చుతుందో చెప్పడం చాలా కష్టం అంటున్నారు. కూటమి గెలవడానికి కూడా చాలానే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సారి ఓటరు తాను ఏ పార్టీకి ఓటేశాడో చెప్పేందుకు జంకుతున్నాడు. ఎందుకంటే వైసీపీకి ఓటేశా అని చెబితే.. రేపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధిస్తారేమో అనే భయం వారిలో ఉంది. అటు టీడీపీకి ఓటేశానని చెబితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే వేధింపులు తప్పవని భయపడుతున్నారు. అందుకే వారు ఏ పార్టీకి ఓటేసింది కరెక్టుగా చెప్పలేకపోతున్నారు.

అలాంటి ఓటరు తీర్పును పట్టుకుని ఎగ్జిట్ పోల్స్ ను కరెక్టుగా ఎలా చెబుతారు. కాబట్టి వాటిని నమ్మడం ఎలా అని అడుగుతున్నారు. చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను ఇస్తాయో.

Author