Ysrcp : కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటుందా.. కారణం ఇదేనా..?

Ysrcp  : రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. శత్రువులు మిత్రులు కావొచ్చు.. మిత్రులు శత్రువులు కూడా కావచ్చు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెత పుట్టింది. కాగా ఇప్పుడు వైసీపీ ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతోంది. అంతే కాకుండా ఏపీలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపదని నమ్ముతోంది వైసీపీ పార్టీ. కానీ కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వైసీపీ కోరుకుంటోందంట. ఇందుకు అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ను జగన్ బద్ద శత్రువులా చూశారు.

Advertisement
Ysrcp : కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటుందా.. కారణం ఇదేనా..?
Ysrcp : కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటుందా.. కారణం ఇదేనా..?

Ysrcp  బీజేపీతో వద్దు..

కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే బెటర్ అని భావిస్తున్నారంట. ఎందుకంటే కేంద్రంలో ఏదో ఒక పార్టీతో సత్సంబంధాలు లేకపోతే లోకల్ పార్టీలకు మనుగడ ఉండదు. అయితే బీజేపీతో ముందుకు సాగడం కొంత బెటర్ అని వైసీపీ నేతలు మొన్నటి వరకు భావించినా..ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడి ఏపీ ఎన్నికల్లో బలంగా నిలబడ్డాయి. కాబట్టి ఇప్పట్లో ఆ కూటమిని విడగొట్టడం ఎవరి వల్ల కాదు అని అంటున్నారు. అందుకే బీజేపీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ తో ముందుకు సాగడమే బెటర్ అంటున్నారు.

Advertisement

పైగా కాంగ్రెస్ కూడా బలమైన వైసీపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి రెడీగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచే రెండు సార్లు సీఎం అయ్యారు. కాబట్టి ఆ బంధాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి ఏపీ డెవలప్ మెంట్ కోసం కాంగ్రెస్ ముందు షరతులు పెట్టి మరీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చని జగన్ భావిస్తున్నారంట. అయితే దానికి కొనసాగింపుగా ఇప్పుడు జగన్ లండన్ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అంత ఈజీగా ఆ రూమర్లను నమ్మలేం.

ఎందుకంటే జగన్ కూడా వెనకా ముందు ఆలోచించకుండా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అయిపోరు కదా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఏమైనా చర్చలు ఉంటాయో లేదో చూడాలి.

Author