Ys Sharmila : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు… అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు..!

Ys Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల Ys Sharmila గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలియజేస్తున్నారు. ఇక ఈ 9 గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రం , డోర్ స్టిక్కర్లను ఇటీవల షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… ప్రజాస్వామ్య బద్దంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని షర్మిల తెలియజేశారు. టికెట్ రానివారు అభ్యర్థి కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం , ప్రజల కోసం , దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో మరియు రాష్ట్రంలో అధికారంలో ఉండాలని లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాలని తెలియజేశారు. మణిపూర్ లాంటి ఘటనలు దీనికి ఉదాహరణ అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

Ys Sharmila : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు... అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు ఇస్తామంటూ...!
Ys Sharmila : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు… అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు ఇస్తామంటూ…!

కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక నమ్మకమని , అదే మన బలమని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే చరిత్ర హీనులుగా మిలుగుతారంటూ షర్మిల తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పాటుపడుదాం మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం అంటూ షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తొమ్మిది గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ తొమ్మిది గ్యారెంటీలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే…

Ys Sharmila : మొదటి గ్యారెంటీ… రాష్ట్రానికి 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేకమైన హోదా గ్యారెంటీ ఇస్తామని…అధికారంలోకి వచ్చిన వెంటనే హోదాను అమలు చేస్తామని పేర్కొన్నారు.

Ys Sharmila రెండవ గ్యారెంటీ…

మహిళా మహాలక్ష్మి…

ఇక ఈ మహిళ మహాలక్ష్మి గ్యారెంటీ ద్వారా ప్రతి పేద మహిళలకు ప్రతినెల 8,500 , ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని మహిళలకు భరోసా ఇచ్చే పథకాన్ని ఆవిష్కరించారు.

Ys Sharmila మూడవ గ్యారెంటీ..

రైతు రుణమాఫీ…అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ లభిస్తుంది.

నాలుగవ గ్యారెంటీ…

Ys Sharmila : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు... అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు ఇస్తామంటూ...!
Ys Sharmila : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు… అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు ఇస్తామంటూ…!

పెట్టుబడి పై 50% లాభాలతో పాటు కొత్త మద్దతు ధర…

ఐదవ గ్యారెంటీ…

ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు కనీస వేతనం 400 రూపాయలు…

ఆరవ గ్యారెంటీ..

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులందరికీ ఉచిత విద్య…

ఏడవ గ్యారెంటీ…

ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఇదే.

ఎనిమిదవ గ్యారెంటీ…

ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళల పేరుపై పక్క ఇల్లు నిర్మాణం.

9వ గ్యారంటీ…

ఇంట్లోని సభ్యులందరికీ పెన్షన్…
అర్హులైన ప్రతి ఒక్కరికి 4000 , వికలాంగులకు 6000

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday