Worlds Richest Man : చరిత్రలో అత్యంత ధనికుడు… ఇతని ముందు నిజం నవాబు , బిల్ గేట్స్ జీరో..!

Worlds Richest Man : నగదు వ్యవహారాలలో కొన్ని కథనాలు చరిత్రలో అత్యంత ధనికుడు లాంటి పదాలతోనే ప్రారంభమవుతాయి. అయితే చరిత్రలో అత్యంత ధనికుడు అనే పదం మన్సా మూసా సుల్తాన్ కు బాగా వర్తిస్తుంది. ఇక ఈయన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే …

1280 – 1337 ప్రాంతంలో మూసా మాలి అనే సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన పరిపాలనలో అనేక బంగారు గనులు ఆయన ఆధీనంలోనే ఉండేవి. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారానికి బాగా డిమాండ్ ఉన్న కాలమది. ఆయన అసలు పేరు మొదటి మూసా కీటా. అయితే సింహాసనం పై కూర్చోవడంతో ఆయన పేరు కాస్త మన్సాగా మారింది. మన్సా అంటే రాజు అని అర్థం. ఇక మన్సా మూస సామ్రాజ్యం ఎంత పెద్దదంటే దాని సరిహద్దులు సైతం ఎవరికి అంతు చిక్కేవి కావు. అయితే నేటి కాలంలో ఉన్న మారిటానియా, సెనెగల్ , జాంబియా, గినియా , బుర్కినా , ఫాసో, మాలి , నైగర్, చాద్ , నైజీరియా వంటివి ఆ కాలంలో మూసా సామ్రాజ్యంలో భాగంగానే ఉండేవి. అయితే ఆ కాలంలో ఆయా ప్రాంతాలలో మూసా నిర్మించిన మసీదులో చాలా మసీదులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకటి టింబక్ టూర్ లోని జింగారేబర్ మసీదు.

Worlds Richest Man : చరిత్రలో అత్యంత ధనికుడు... ఇతని ముందు నిజం నవాబు , బిల్ గేట్స్ జీరో..!
Worlds Richest Man : చరిత్రలో అత్యంత ధనికుడు… ఇతని ముందు నిజం నవాబు , బిల్ గేట్స్ జీరో..!

Worlds Richest Man : మూసా సంపద ఎంత అంటే…

మూసా సంపదను నేటి లెక్కల్లో అంచనా వేయడం చాలా కష్టతరమైన పని. అయితే ఒక అంచనా ప్రకారం అయితే మన భారత కరెన్సీలో ఆయన సంపద విలువ సుమారు 25 లక్షల కోట్లు. అయితే తాజాగా నివేదించిన అంచనాల ప్రకారం ఫ్రాన్స్ కు చెందినా బేర్నార్డ్ ఆర్నాల్డ్ చెందిన కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఇక వారి ఆస్తులు విలువ భారత కరెన్సీలో దాదాపు 18 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఇక వీరి ఆస్తి విలువ సుమారు 16 లక్షల కోట్లు ఉంటుంది. అంటే ప్రస్తుతం ప్రపంచ కుబేర్లుగా ఉన్న వీరందరి కంటే కూడా మన్సా మూసా సంపద చాలా ఎక్కువ…

ఇది ఇలా ఉండగా మన్సా మూసా మక్కా యాత్ర గురించి ప్రత్యేక కథనం ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇది 1324లో జరిగినట్లుగా సమాచారం. ఇక ఈ యాత్ర సుమారు 6000 కిలోమీటర్లు సాగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే మన్సా మూసా వెళ్లే దారిలో ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు ఆయన వెంట ఉన్న పరివారాన్ని చూసి నోరు వెళ్ల పెట్టేవారట. ఇక మూసా పరివారంలో సుమారు 60, వెల మంది ఉండేవారట. వారిలో 12 వేల మంది కేవలం ఆయన వ్యక్తిగత సహాయకులు మాత్రమే. ఇక మూసా యాత్రలో ఆయన ముందు 500 మంది గుర్రాలపై స్వారీ చేస్తుండగా…వారి చేతుల్లో బంగారు కర్రలు ఉండేవి. ఇక ఈ 500 మంది సైనికులు అత్యంత ఖరీదైన పట్టు వస్త్రాలను ధరించుకొని కనిపించేవారు. దీనితోపాటు పరివారంలో 80 ఒంటెల బృందం ఉండేది. దానిపై సుమారు 136 కిలోల బంగారం ఉండేదట.

Worlds Richest Man : చరిత్రలో అత్యంత ధనికుడు... ఇతని ముందు నిజం నవాబు , బిల్ గేట్స్ జీరో..!
Worlds Richest Man : చరిత్రలో అత్యంత ధనికుడు… ఇతని ముందు నిజం నవాబు , బిల్ గేట్స్ జీరో..!

Worlds Richest Man : మూసా మక్కా యాత్ర

ఇక మూసా ఎంత ఉదారుడు అంటే ఆయన వెళ్తున్న మార్గమధ్యంలో ఈజిప్ట్ రాజధాని కైరో మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పేదలకు ఆయన చేసిన దానధర్మాల వలన ఆ ప్రాంతంలో ధరలు ఒక్కసారిగా పెరిగెవట. అయితే మూసా మక్కా యాత్రతో ఆయన సంపద గురించి పలు వార్తలు యూరప్ ప్రజల చెవినపడ్డాయి. ఇది నిజమేనా అని చాలామంది యూరోపియన్లు ఆయనను సందర్శించేందుకు మూసా రాజ్యానికి వచ్చే వారట. ఆ సందర్భంలో ఆయన సంపద నిజమె అని తెలుసుకున్న అనంతరం మాలి సామ్రాజ్యాన్ని ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్న కేటలాన్ అట్లాస్ లో చేర్చడం జరిగింది. దాదాపు 14వ దశాబ్దపు కాలానికి చెందిన ఈ కేటలన్ అట్లాస్ ను ఉపయోగించి యూరోపియన్ల తమకు తెలిసిన అన్ని ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించేవారట.

దాదాపు 20 ఏళ్ల పాటు సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన తర్వాత మూసా 1337లో మరణించారు. అయితే తాజాగా ఈ రాజు గురించి మెషిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రుడాల్ఫ్ వైర్ మనీ పత్రికతో మాట్లాడుతూ….ఇది చరిత్రలోనే అత్యంత ధనికుడైన వ్యక్తికి సంబంధించిన విషయాలని…ఆయనకు ఎంత సంపద ఉంది అనే విషయాలను అంచనా వేయడం కూడా అసాధ్యమని చెప్పుకొచ్చారు..అందుకే మూసాను చరిత్రలోనే అత్యంత ధనికుడు అని అంటారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది