Lakshmi Devi : సాధారణంగా మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా ఇప్పటి తరం వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు. చాలామంది ఏమంటారు అంటే వారు చెప్పేది మూఢనమ్మకాలుగా భావించి కొట్టి పారెస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన పెద్దలు ఏం చెప్పిన దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది.అయితే మన పెద్దలు గడప మీద అసలు కూర్చోకూడదని చెబుతుంటారు. గడప మీద కూర్చుంటే చాలా అనర్ధాలు జరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా అసలు మంచిది కాదు. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెట్టదు. మరి గడప మీద కూర్చుంటే అసలు ఏం జరుగుతుందనేది విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..అయితే ఇంటికి ప్రధాన ద్వారం అయిన గడప మీద కూర్చోకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ ద్వారం గుండానే కదా ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేది.
అలాంటి గాలి వెలుతురు ను ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీ నీ బయటకు తీసుకువెళ్లే గాలిని గడప పై మీరు కూర్చోని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి కూడా అసలు మంచిది కాదు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే గడపకు మధ్యలో కూర్చోవడం అసలు మంచిది కాదు. గడపపై కూర్చోవడం గడపకు దిగి ఉన్న మెట్లపై కూర్చోవడం మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్లు అవుతుంది. అంతేకాకుండా ఇంటి ని నిర్మించేటప్పుడు ప్రధాన ద్వారానికి పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకనే ప్రధాన ద్వారం ని లక్ష్మీదేవిగా పూజిస్తాం.కాబట్టి ప్రధాన ద్వారం మీద కూర్చోవడం వలన లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. అందుకనే మన పూర్వికులు గడపపై కూర్చోవడం నిలబడడం ఎక్కి తొక్కడం వంటివి కీడుకు సంకేతని చెప్పడం జరిగింది. అంతేకాక ఇలా ఇంటి గడప పై కూర్చోవడం వలన బాధలు పెరుగుతాయని మరియు దరిద్రం కూడా అని చెప్పారు. అయితే గడపపై కూర్చోవడం అనేది మూఢనమ్మకం కాదు.
సైన్స్ పరంగా కూడా ఇది ధ్రువీకరించబడింది. రోసి రోన్ అనే శాస్త్రవేత్త కనుగొన్న తర్వాత ఈ మార్పు అక్షర సత్యం అని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఇంటికి ప్రధాన ద్వారం పైన కూర్చోవడం మంచిది కాదు. అయితే చాలామంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. గడప మీద అస్సలు కూర్చోకూడదు. అలాగే గడపకు చిన్న మెట్ల మీద కూర్చోవడం శ్రేయస్సు కరం కాదు. అలా కూర్చున్నట్లయితే నీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్న వారు అవుతారు. అందుకని పూర్వీకులు అలా చేయకూడదు అని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది గడప మీద తలగడ పెట్టుకొని పడుకుంటారు. ఇలా చేయడం కన్నా దరిద్దరం మరొకటి ఉండదు. చెప్పులు వదిలి లోపలికి వెళ్ళేటప్పుడు గడప కి ఎదురు గా వదిలి వెళ్ళకూడదు. గడప కి కుడి వైపున మాత్రమే చెప్పు లని వదలాలి. అలాగే ప్రతి శుక్రవారం గడపను శుభ్రం చేసి బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం పొందినట్లే కాబట్టి గడప విషయంలో తప్పని సరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి.