Science : చేతులు, మెడ, నుదుటిపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు.. ఇంత సైన్స్ ఉందా..?

Science :  హిందువులు అందరూ నుదుటిపై తిలకాలు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం నుదుటిపైనే కాకుండా చేతులు, మెడ, చాతిపై కూడా నామాలు పెట్టుకుంటారు చాలామంది. అందులోనూ వైష్ణవులు, శైవులు ఇలాంటి నామాలు ఎక్కువగా పెట్టుకుంటారు. నుదుటిపై కూడా నామాలు పెట్టుకుంటారు చాలామంది. అయితే ఇలా నామాలు పెట్టుకోవడం వెనక చాలా పెద్ద కథే ఉందని అంటున్నారు. ఎందుకంటే మన బాడీలోని ప్రతి పార్టుకు దైవంతో సంబంధాలు ఉంటాయని అంటున్నారు. నుదుటిని బ్రహ్మ అధీష్టంగా పేర్కొంటారు. అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు.

Advertisement

మెడపై తిలకం పెట్టుకోవడం..

చాలా మంది మెడపై తిలకం పెట్టుకుంటారు. ఇందులో ఓ ఆచారం కూడా ఉందండోయ్. ఇక్కడ బొట్టు లేదా తిలకం పెట్టుకుంటే శుభం జరుగుతుందని అనుకుంటారు. దాంతో పాటు మన ఆలోచనలు పనుల మధ్య సమతుల్యత ఉంటుందని భావిస్తారు. అంతే కాకంఉడా అన్నవాహికకు దగ్గరగా ఉంటుంది కాబట్టి తినే ఆహారాన్ని గౌరవించినట్టు అవుతుంది. దాంతో పాటు మాటలు మరింత స్పష్టంగా, మృదువుగా, శ్రావ్యంగా వినిపిస్తాయని కూడా నమ్ముతారు. ఇక మరో విషయం ఏంటంటే మెడ చుట్టూ అంగారక గ్రహం ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం వల్ల అంగారకుడి అనుగ్రహం దక్కుతుందని భావిస్తారు.

Advertisement
Science : చేతులు, మెడ, నుదుటిపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు.. ఇంత సైన్స్ ఉందా..?
Science : చేతులు, మెడ, నుదుటిపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు.. ఇంత సైన్స్ ఉందా..?

చేతిపై నామాలు పెట్టుకోవడం..

హిందువుల్లో చాలా మంది చేతిపై నామాలు కూడా పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని జరుగుతాయని వారినమ్మకం. చేతిపై శుక్రగ్రహం ఉంటుందని నమ్ముతారు. ఇలా అక్కడ తిలకం పెట్టుకుంటే సానుకూల ప్రభావం పెరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే చేతు,భుజాల దగ్గర నామాలు పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మంచి లక్షణాలు పెరుగుతాయని కూడా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు వారి జీవితంలో బలహీనంగా ఉంటే ఇలాచేతిపై నామాలు పెట్టుకుంటారు. దాని వల్ల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

ఛాతీపై నామాలు పెట్టుకోవడం..

చాతిపై నామాలు పెట్టుకోవడం వెనక కూడా పెద్ద కథ ఉంది. ఎందుకంటే చాతి మీద దేవుడు నివసిస్తాడని నమ్ముతారు. అందుకే చాతిపై నామాలు, విభూది పెట్టుకుంటారు. దాని వల్ల మన భక్తిని చాటుకున్నట్టు అవుతుంది. అంతే కాకంఉడా ఇక్కడ నామాలు పెట్టుకుంటే మన భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఇలా చేయాలి. జీవితంలో ఖగోళ వస్తువుల ప్రభావాన్ని సమన్వయం చేయవచ్చు. దాంతో పాటు సూర్యుడి శక్తిని కూడా గ్రహించవచ్చు.

అంతే కాకుండా ఇలా ఛాతిపై తిలకం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. కరుణ, శాంతి కలుగుతాయని చెబుతుంటారు. చాతిపై దేవుడు ఉంటాడు కాబట్టి.. అక్కడ నామాలు, తిలకాలు పెట్టుకుంటే దేవుడిని నిత్యం పూజిస్తున్నట్టే అవుతుందని భావిస్తుంటారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday