Kalki 2898 AD : ఓటీటీలోకి ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. వచ్చేది అప్పుడేనా?

Kalki 2898 AD : ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ కల్కి మూవీ గురించే చర్చ. కల్కి 2898 ఏడీ పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైనే వసూలు చేసింది. కొన్ని టాప్ మూవీస్ ను పక్కకు నెట్టేసింది.

Advertisement

When prabhas kalki 2898 ad released in ott

Advertisement

థియేటర్లలో ఈ మూవీ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి.. ఓటీటీలో రిలీజ్ అయితే ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే చాన్స్ లేదని తెలుస్తోంది. దానికి కారణం.. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో హడావుడి చేయడమే. థియేటర్లలో ఈ మూవీ ఇంకా మంచి వసూళ్లను సాధిస్తోంది. అందులోనూ ఇటీవల రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం, మరే సినిమా కూడా లేకపోవడంతో.. ప్రేక్షకులు ఎక్కువగా కల్కి సినిమానే ప్రిఫర్ చేస్తున్నారు.

అందుకే.. ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయకూడదని మూవీ యూనిట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా విడుదలైన 10 వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంటే.. వచ్చే నెల కూడా కాదు. సెప్టెంబర్ లో ఈ మూవీ విడుదలయ్యే చాన్స్ ఉందన్నమాట. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Author