Union Budget 2024 : ఈనెల 23న కేంద్ర బడ్జెట్.. 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

Union Budget 2024 : ముచ్చటగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. హ్యాట్రిక్ సాధించి ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. అయితే.. ఈసారి ఇండియా కూటమి కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. 200 సీట్లకు పైగా ఇండియా కూటమి సీట్లు సాధించింది అంటే.. ఎన్డీఏకు ఎంత పోటీ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఫ్రెష్ గా బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే అది ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. ఎన్నికలు ముగిసి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

Advertisement

union budget 2024 from July 22

Advertisement

అందుకే.. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కేంద్రం నిర్వహించబోతోంది. అందులో భాగంగానే ఈనెల 23న పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

Union Budget 2024 : జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు

జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక.. మోదీ 3.0 వర్షన్ లో ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇదే. ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్.. ఆర్థిక మంత్రిగా ఆరు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా ఆమె బడ్జెట్ ను ప్రవేశ పెడుతుండటంతో ఆమె వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రిగా చరిత్రకెక్కనున్నారు. 2019 నుంచి ఆమె కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

Author