Ugadi Festival : ఏప్రిల్ 9 ఉగాదిలోపు ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇవి పెట్టండి..!

Ugadi Festival  : ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది తెలుగు వారి పండగ. తెలుగు సంవత్సరం ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతి లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యవతారాన్ని ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతిదీ.. జీవితంలో కూడా కష్టాలు ,సుఖాలు, ఇటువంటి అనుభవాలు మిళితమై ఉంటాయని ఈ ఉగాది పచ్చడి మనకు ఒక అర్ధాన్ని తెలియజేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఉగాది పర్వదినం ఏప్రిల్ 9వ తేదీన రాబోతుంది. మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న ఆలోపుగా ఆవు కనిపిస్తే ఎవరైతే ఇది పెడతారో.. అంటే ఆవుకి తినటానికి ఎవరైతే ఇది పెడతారో.. వారి జీవితంలో తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది.

ఆవును సకల దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. గోమాత సంరక్షణ కోసం గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపడం వల్ల మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికా దేవి యొక్క వెయ్యి నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములు గోమాత అనే పేరు ఒకటి. అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే .అంటే శ్రీ ఆదిపరాశక్తి కాబట్టి గోమాత శ్రీ లలితాంబికా దేవి యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. గోవుకు ప్రదక్షణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు మీరు ప్రదక్షిణం చేసినట్లే.. గోవుకు పచ్చ గడ్డి తినిపిస్తే సాక్షాత్తు నైవేద్యం పెట్టినట్లే.. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయటానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్లే.. గోవులు దూడలు నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది.

Sagittarius : ఉగాది తర్వాత నుండి ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారు చెప్పిన ఒళ్ళు జల్లుమనే నిజాలు..!
Sagittarius : ఉగాది తర్వాత నుండి ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారు చెప్పిన ఒళ్ళు జల్లుమనే నిజాలు..!

అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు.. ఎంత అయితే సంపాదించారో అంతకు రెట్టింపు సంపాదనను అతి త్వరలో పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రతికూల అంశాలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆ ప్రతికూల అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అయితే గోమాతకు మీరు తినిపించ వలసింది ఏమిటంటే. నానబెట్టిన సెనగలు. ఇవి గోమాతకి చాలా ఇష్టం. కూడా ఈ నానబెట్టిన సెనగలను గోమాతకు తినిపించడం వల్ల మీరు జీవితంలో మీకున్న ప్రతికూల అంశాలు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి ,అనారోగ్య పరిస్థితులు అలాగే మీ కుటుంబ జీవితంలో కలహాలు అలాగే ప్రశాంతత లేకపోవడం ఇటువంటి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది.

గోమాత అనుగ్రహం మీకు లభించినట్లయితే.. సాక్షాత్తు 33 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్లే.. ఆ శ్రీమహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా మీకు మెండుగా లభిస్తాయి. కాబట్టి కచ్చితంగా గోమాత కనిపిస్తే గనక కచ్చితంగా ఏప్రిల్ 9వ తేదీన వస్తున్నటువంటి ఉగాదిలోపు నానబెట్టిన సెనగలు తినిపించండి. మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అతి త్వరలో మనం ఉగాది పర్వదినం రోజు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న ఈ నూతన సంవత్సరానికి ముందే మీరు మంచి రోజు చూసుకుని శనగలను నానబెట్టుకొని ఆ నానబెట్టిన శనగలను మీరు గోమాతకు తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక మీరు జీవితంలో మీరు కోల్పోయినవి దక్కించుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది