Raj Tarun : రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్

Raj Tarun : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు గురించి తెలుసు కదా. రెండు రోజుల నుంచి సోషల్ మీడియా, తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల గురించే చర్చ. రాజ్ తరుణ్, లావణ్య.. ఇద్దరూ లవర్స్ అని.. గత 11 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. ఒకే ఇంట్లో ఉంటున్నారని.. కానీ.. కొన్ని నెలల నుంచి లావణ్యను రాజ్ తరుణ్ పట్టించుకోవడం లేదని రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య అతడిపై కేసు పెట్టింది.

Advertisement

twist in raj tarun and Lavanya case

Advertisement

దీంతో అసలు రాజ్ తరుణ్ కు లవర్ కూడా ఉందా అని తెలుగు సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సినీ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. ఆ హీరోయిన్ సోదరుడు తనను బెదిరిస్తున్నాడని.. తనకు రక్షణ కావాలని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగిందో మీడియాకు చెప్పాడు.

అయితే.. ఈ కేసులో ఓ ట్విస్ట్ జరిగింది. రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన లావణ్యకే పోలీసులు నోటీసులు పంపించారు. తనను మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేయడంతో.. వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపించారు. 91 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినప్పటి నుంచి లావణ్య అందుబాటులో లేనట్టు సమాచారం.

Author