Puja Khedkar : ఆమె పేరు పూజ ఖేడ్కర్. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్. 2023 బ్యాచ్ కి చెందిన అధికారిణి. ఇంకా ట్రెయినింగ్ లోనే ఉన్నా.. ఆమె చేసిన హడావుడి చూసి అధికారులకే బిత్తరపోయారు. తన ఐఏఎస్ ఎంపిక దగ్గర్నుంచి తను చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. తన పదవిని అడ్డం పెట్టుకొని పూజ చేస్తున్న హడావుడి మీద డౌట్ వచ్చి అధికారులు ఆరా తీయగా తన బండారం మొత్తం బయటపడింది.
నిజానికి తన తండ్రికి కోట్ల ఆస్తి ఉంది. కానీ.. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కింద ఐఏఎస్ పోస్టింగ్ కొట్టేసింది పూజ. అంతే కాదు. సివిల్స్ సెలక్షన్ ప్రాసెస్ సమయంలోనూ తను దివ్యాంగురాలిగా పేర్కొంటూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఐఏఎస్ పోస్ట్ కొట్టేసింది. చివరకు మెడికల్ టెస్టులను కూడా ఎగ్గొట్టేసి.. ప్రస్తుతం ప్రొబెషనరీ పీరియడ్ లోనే ఉన్నా.. తన సొంత లగ్జరీ కారుకు సైరెన్ పెట్టుకొని.. వీఐపీ నెంబర్ ప్లేట్, మహారాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ పెట్టుకొని తను చేసిన హడావుడిని చూసిన అధికారులు తనను వాసింకి ట్రాన్స్ ఫర్ చశారు.
Puja Khedkar : పూజపై మహారాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పూణె కలెక్టర్ సుహాస్
తనపై అనుమానం వచ్చిన పూణె కలెక్టర్ సుహాస్ దివాసె.. మహారాష్ట్ర సీఎస్ కు ఫిర్యాదు చేయడంతో తన బండారం మొత్తం బయటపడింది. తను ఇంకా అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోకముందే.. తనకు ప్రత్యేకంగా ఉండటానికి ఇల్లు కావాలని, సపరేట్ కారు కావాలని పూణె కలెక్టర్ ను డిమాండ్ చేసింది.
తన పదవిని అడ్డం పెట్టుకొని పూజ చేస్తున్న బాగోతాలపై పూణె కలెక్టర్ ఫిర్యాదుతో తీగ లాగితే డొంకంతా కదిలింది. పూణె అదనపు కలెక్టర్ అజయ్ మోరే ఆఫీసును కూడా తన సొంత ప్రయోజనాల కోసం వాడుకొని తన పదవిని అడ్డం పెట్టుకొని అవినీతికి తెర లేపినట్టుగా అధికారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా.. కలెక్టర్ కాకముందే ట్రెయినింగ్ లో ఉన్నప్పుడే పూజ ఇన్ని చేస్తే.. ఇక కలెక్టర్ అయితే ఇంకెన్ని చేస్తుందో అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.