Three MLAs in One Constituency : ఒకే నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు.. మన ఏపీలోనే.. ఏ నియోజకవర్గమో తెలుసా?

Three MLAs in One Constituency : అదేంటి.. ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు కదా. మరి మీరేంటి ఒకే నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే.. ఒక్క నియోజకవర్గంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

three mlas stay in vizag east assembly constituency

సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఉండేది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కానీ.. ఈ నియోజకవర్గంలో మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటానికి కారణం వాళ్లందరి ఇళ్లు ఉండేది అక్కడే. అది కూడా ముగ్గురి నివాసాలు దగ్గర్లోనే ఉండటం విశేషం.

Three MLAs in One Constituency : ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు?

వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తెలుసు కదా. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే. ఇక.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైజాగ్ దక్షిణం నుంచి గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేది వైజాగ్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే.

ఈ ముగ్గురి ఇళ్లు వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గం సెగ్మెంట్ లోనే వస్తాయి. ఇక… ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో.. వారి ఇళ్లకు ఆయా నియోజకవర్గాల ప్రజలు క్యూ కడుతున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడం కోసం వైజాగ్ ఈస్ట్ సెగ్మెంట్ కు వచ్చేస్తున్నారు. అలా.. ఒకే నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు అన్నమాట.

Author