Uttam Kumar Reddy : కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది అప్పుడే.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Minister Uttam : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కానీ.. తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Telangana minister uttam kumar reddy about new ration cards

Advertisement
Advertisement

ఈ మధ్య చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు రేషన్ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కానీ.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని, రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేస్తామని.. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ రెండు వేర్వేరుగా అందిస్తామని తెలిపారు.

కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి? అనే దానిపై, దాని విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు కాగానే ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రేషన్ కార్డును నిత్యావసర సరుకుల కోసమే వాడాలని, ప్రభుత్వ పథకాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని, ఆరోగ్యశ్రీ కార్డు కేవలం వైద్యం కోసమేనని ఉత్తమ్ వెల్లడించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రేవంత్ సర్కారు కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Author