Rythu Runa Mafi : రూ.2 లక్షల రుణమాఫీలో అర్హుల్లో మీరు ఉన్నారా ఇలా చెక్ చేసుకోండి..?

Rythu Runa Mafi : తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. తాజాగా రైతు రుణమాఫీలకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగానే డిసెంబర్ 9వ తేదీని రవణమాఫీ కట్ఆఫ్ తేదీగా ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఏకకాలంలోనే రుణమాఫీలన్నింటినీ మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 9 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలు అన్నింటినీ కూడా ఒకే విడతలో మాఫీ చేయాలని నిర్ణయించుకుంది. క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న ఈ నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 47 లక్షల మంది రైతులకు మంచి ఊరట లభించనుంది.

Rythu Runa Mafi : రూ.2 లక్షల రుణమాఫీలో అర్హుల్లో మీరు ఉన్నారా ఇలా చెక్ చేసుకోండి..?
Rythu Runa Mafi : రూ.2 లక్షల రుణమాఫీలో అర్హుల్లో మీరు ఉన్నారా ఇలా చెక్ చేసుకోండి..?

అయితే ఎన్నికల ప్రచారాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతన్నలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ఈ పథకాన్ని అమలు చేయడం కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు15 లోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతుంది.

Rythu Runa Mafi : క్యాబినెట్ భేటీ…

దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ ప్రదానాంశంగా పేర్కొంటూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల శుక్రవారం రోజున భేటీ అయ్యారు. ఇక ఈ భేటిలో భాగంగా రైతులకు రుణమాఫీ ఎలా చేయాలి..? దశలవారీగా చేయాలా లేకపోతే ఒకేసారి చేయాలా అనే అంశాల గురించి మంత్రివర్గం చర్చించడం జరిగింది..? అన్ని తీర్మానాలను పరిగణించిన తర్వాత ఏకకాలంలోనే రైతు రుణమాఫీని చేయాలని నిర్ణయించుకున్నారు. అదికూడా ఆగస్టు 15లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రైతు సోదరుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఒకే దఫాలో రైతు రుణాలు మాఫీ చేయడం పై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Author