DSC Candidates : అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ అభ్యర్థుల నిరసన.. రాకేష్ రెడ్డి మద్దతు

DSC Candidates : నిరుద్యోగులమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. కానీ.. ఇది మాకు సిగ్గు చేటుగా అనిపిస్తోంది అని నిరుద్యోగులు వాపోతున్నారు. నిరుద్యోగులు అందరం కలిసి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అని డీఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ అభ్యర్ధులు అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. వాళ్లకు సంఘీభావంగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అక్కడికి చేరుకొని వాళ్లకు మద్దతు పలికారు.

Telangana dsc candidates protest in Osmania university

మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆడపిల్లలు అర్థరాత్రి వచ్చి యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తుంటే ఆడపిల్లలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి నిర్బంధించారు. నిరుద్యోగుల రక్తాన్ని కళ్ల చూస్తున్నారు. వాళ్ల గోస పుచ్చుకుంటున్నారు. కారు చీకట్లలో ఉద్యమకారులను బంధిస్తున్నారు. వాళ్లు చేసిన తప్పులు ఏంటి.. వాళ్లను ఎందుకు బంధించారు.. అంటూ రాకేష్ రెడ్డి ప్రశ్నించారు…

DSC Candidates : డీఎస్సీ వాయిదా వేయాలని నిరసన

డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థినులు అభ్యర్థిస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ వాయిదాతో పాటు ఉన్న సిలబస్ పది రోజుల్లో చదవడం కష్టం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తది. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు.. అని డిఎస్సీ అభ్యర్థినులు నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ డీఎస్సీని షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈనెల 11 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి.

Author