Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎట్టకేలకు ఖమ్మం రైతు ఆత్మహత్యపై స్పందించారు. అలాగే.. రుణ మాఫీపై కూడా మాట్లాడారు. తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన భట్టి విక్రమార్క.. త్వరలోనే రుణమాఫీ అమలు చేస్తామన్నారు. మాట ఇచ్చిన ప్రకారమే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై కావాలని ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అంతే కాదు.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు.
అలాగే.. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని హితువు పలికారు. రైతే కాదు.. ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. చావు మాత్రమే పరిష్కారం కాదన్నారు. ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించి ఉంటే దర్యాప్తులో అది బయటికి వస్తుందన్నారు. ఎందుకు జరిగింది.. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది చాలా లోతుగా స్టడీ చేసి చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. దీని వెనుక ఎవరు ఉన్నా ఎవ్వరినీ ఉపేక్షించేది లేదన్నారు.
Bhatti Vikramarka : రేవంత్, చంద్రబాబు సహచరులు మాత్రమే.. గురుశిష్యులు కాదు
రేవంత్ రెడ్డి, చంద్రబాబు కేవలం గురుశిష్యులు మాత్రమే.. వాళ్లు సహచరులు కాదని భట్టి విక్రమార్క అన్నారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు బహిరంగంగానే చెప్పారన్నారు. అవగాహన లేని మాటలు మాట్లాడొద్దన్నారు. అలాగే కేబినేట్ విస్తరణ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి పవర్ కట్స్ లేవు.. అంతరాయం మాత్రమే ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను భరించలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మేము కాంగ్రెస్ లోకి రమ్మని అడగడం లేదు. కేసీఆర్ అన్యాయాన్ని అరికట్టడానికి వస్తున్నారన్నారు భట్టి.