Samantha Naga Chaitanya : ఏంటి.. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారా..?

Samantha Naga Chaitanya :ఇప్పుడు తెలంగాణను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. చాలా పెద్ద పెద్ద నేతల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు తాజాగా సినీ స్టార్ల పేరు కూడా వినిపిస్తున్నాయి. ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో వెలుగు చూస్తున్న పేర్లు వింటే అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. కాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయాల వరకే పరిమితం కాలేదని తెలుస్తోంది. అటు సినీ స్టార్ల పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్, హీరో పేర్లు తెరమీదకు వచ్చాయి.

Samantha Naga Chaitanya : ఏంటి.. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారా..?
Samantha Naga Chaitanya : ఏంటి.. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారా..?

దాంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను Social Media షేక్ చేస్తోంది. దాంతో ఎవరా స్టార్ హీరో, హీరోయిన్ అనేది తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్త మరింత క్యూరియాసిటీని పెంచేసింది. పైగా ఈ స్టార్ల విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమా అనే విషాయన్ని ఇప్పటి వరకు అటు పోలీస్ అధికారులు కూడా నిర్ధారించలేదు. దాంతో ఇందులో మరింత క్యూరియాసిటీ పెరిగింది. అయితే తాజాగా ఈ క్యూరియాసిటీకి తెరదించేశారు తీన్మార్ మల్లన్న.

తాజాగా ఆయన కవిత అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే విడాకులు తీసుకున్నారని చెప్పడం సంచలనం రేపుతోంది. ఆ ఇద్దరు సెలబ్రిటీల మధ్య అప్పటి అధికార పార్టీలోని కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే విడాకులు తీసుకొన్నారని తెలుస్తున్నది. ఇంకా వాస్తవాలు తెలుసుకొని దానిపై మరింత వివరంగా వీడియో చేస్తాను అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samantha Naga Chaitanya : ఏంటి.. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారా..?
Samantha Naga Chaitanya : ఏంటి.. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారా..?

దాంతో ఈ స్టార్లు ఎవరనే అంశానికి ఆయన ఇలా తెరదించేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉందని ఆయన చెప్పారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలుసుకుని మరిన్ని వీడియోలు చేస్తానంటూ ఆయన చెప్పడం సంచలనం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్ లో అలజడి రేపుతోంది. అంటే మరింత మందిస్టార్లు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కున్నారా అని అడుగుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday