ICC T20 World cup Final : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా గెలిచి 13 ఏళ్ల వరల్డ్ కప్ కలని నిజం చేసింది. అంతేకాదు 17 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది. ఎప్పటిలానే సౌతాఫ్రికాకు ఐసీసీ వరల్డ్ కప్ ఆశలను ఆవిరిచేసింది. ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేధనలో మొదట కాస్త తడబడినా సౌతాఫ్రికా బ్యాటర్లు స్టబ్స్ 31, క్లాసెన్ 52 జట్టు విజయానికి బాటలు వేశారు.
ఐతే హార్ధిక్ పాండ్య క్లాసెన్ ని పెవిలియన్ పంపగా వెంటనే బూమ్రా జాన్సన్ ని బౌల్డ్ చేశాడు. కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్ క్రీజ్ లో ఉన్నారు. చివరి ఓవర్ లో 6 బంతులకు 16 పరుగులు చేయాల్సి ఉండగా హార్ధిక్ పాండ్యా వేసిన మొదటి బంతికే సిక్స్ ట్రై చేశాడు డేవిడ్ మిల్లర్. ఐతే కరెక్ట్ గా పెవిలియన్ దగ్గర సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ తో మిల్లర్ ని పంపించేశారు. ఆ క్యాచ్ పట్టిన తీరు చూస్తే దాదాపు పెవిలియన్ కి సూర్య కాలు టచ్ చేసినట్టుగానే అనిపించింది కానీ థర్డ్ ఎంపైర్ అది ఔట్ ఇచ్చాడు.
ICC T20 Wordl cup Final క్యాచ్ కాదు సిక్స్ అంటున్న సౌతాఫ్రికా మీడియా
మిల్లర్ అవుటవ్వడం తో 5 బంతులకు 16 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజ్ లో ఉన్న రబడా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు రన్స్ తీశరు. ఇక 2 బంతుల్లో 10 కొట్టాల్సి ఉండగా కేవలం రెండు పరుగ్లు మాత్రమే చేశారు. ఐతే సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై సౌతాఫ్రికా మీడియా అది సిక్స్ ని సూర్య కుమార్ కాలు పెవిలియన్ ని టచ్ చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే అది కావాలని ప్రచారం చేయడమే తప్ప సూర్య కుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వల్లే టీం ఇండియా గెలిచిందని చెప్పొచ్చు.