Summer Drinks : ఈ వేసవిలో చల్ల చల్లగా ఈ డ్రింక్ ట్రై చేయండి…!

Summer Drinks  : మండే ఎండల్లో మన శరీరం చల్ల చల్లని పానీయాలను కోరుకుంటుంది. చల్లని ఓ గ్లాస్ పానీయం తాగితే శరీరానికి ఎంతో ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల డ్రింక్స్ హెల్త్ కి మంచివి కాదు. ఆరోగ్యానికి ఉపయోగపడే డ్రింకులు మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ సమ్మర్లో చల్లగా వేసవి తాపం తగ్గించే డ్రింక్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.. చెరుకు రసం: చెరుకు రసం ఇది న్యాచురల్ గా తయారైంది మాత్రమే త్రాగాలి. దీని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు శరీరానికి శక్తి లభిస్తుంది. వేడి కారణంగా అలసిన శరీరానికి దీని వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. కావున చెరుకు రసం బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పవచ్చు..

Summer Drinks  కొబ్బరి బోండాలు

సమ్మర్ లో కొబ్బరి బోండాలు బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి రోజుకు గ్లాసు కొబ్బరి నీటిని తీసుకోవాలి. దీనివలన అందులోని ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
లెమన్ వాటర్: వేసవికాలంలో తప్పకుండా తాగాల్సిన నీరు. లెమన్ వాటర్ నిమ్మకాయలను నీటిలో పిండి కొద్దిగా ఉప్పు, కొంచెం పంచదార వేసి షర్బతులా చేసి తీసుకోవాలి. ఇది తాగితే అప్పుడుకప్పుడు మంచి ఉపశమనం కలుగుతుంది.

Summer Drinks : ఈ వేసవిలో చల్ల చల్లగా ఈ డ్రింక్ ట్రై చేయండి...!
Summer Drinks : ఈ వేసవిలో చల్ల చల్లగా ఈ డ్రింక్ ట్రై చేయండి…!

Summer Drinks  లస్సీ

పెరుగుతో చేసిన లస్సి కూడా మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎంత వేడిగా ఉన్న కాస్త లస్సీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
కోల్డ్ టీ: టీ అనేది చాలామందికి చాలా ఇష్టం మరి సమ్మర్లో ఏ విధంగా తీసుకోవాలంటే ఈ సమ్మర్ లో వేడిగా కాకుండా చల్లగా తీసుకోవాలి. అంటే పాలు లేకుండా డికాషన్ లో నిమ్మరసం వేసి దాన్ని చల్లపరిచి తీసుకోవాలి. దీనివలన అలసట తగ్గిపోతుంది.

Summer Drinks  కోల్డ్ కాఫీ

కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. అయితే ప్రతిసారి వేడి కాఫీ తాగే బదులు ఇప్పుడు సీజనికి తగ్గట్టుగా కోల్డ్ కాఫీ తీసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి రిఫ్రెష్ గా కూడా ఉంటుంది.

మ్యాంగో లస్సీ : వేసవికాలం అంటే మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని లస్సిలా చేసుకుని ట్రై చేయవచ్చు. ఇవి నార్మల్ లస్సీ కంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. పెరుగు కూడా కలుపుతాం. కాబట్టి రెండిటి కలయిక అద్భుతమైన టేస్ట్ వస్తుంది.

Summer Drinks : ఈ వేసవిలో చల్ల చల్లగా ఈ డ్రింక్ ట్రై చేయండి...!
Summer Drinks : ఈ వేసవిలో చల్ల చల్లగా ఈ డ్రింక్ ట్రై చేయండి…!

పచ్చి మామిడి రసం : పచ్చి మామిడి రసం లా చేసి తీసుకోవచ్చు.. ఇది కూడా వేసేవి తాపాన్ని తగ్గించేసి శరీరానికి శక్తినిస్తుంది. దీని వలన హైడ్రేట్ గా కూడా ఉంటారు. కావున ఈ డ్రింక్ ని ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి..

పుచ్చకాయ జ్యూస్ : సమ్మర్ అనగానే గుర్తొచ్చేది పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. కావున ఇది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts