Stock Market : అసలే వీక్ ప్రారంభం.. సోమవారం ఉదయమే స్టాక్ మార్కెట్లు ఢమాల్ అన్నాయి. సోమవారం ఉదయం చాలా హోప్ తో చాలామంది ముదుపర్లు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఉదయం 9 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ.. స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయమే భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.15 కు ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్లు 5 నుంచి 10 నిమిషాల్లోనే కుప్పకూలిపోయాయి.
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కి చెందిన సెన్సెక్స్ ఉదయం 9.30 లోపే 350 వరకు పాయింట్లు కోల్పోయి 80,200 వద్ద కొనసాగింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కి చెందిన నిఫ్టీ కూడా వందకు పైగా పాయింట్లు కోల్పోయింది. 24,400 వద్ద ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతోంది.
అయితే.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ప్రతికూల సంకేతాలు ఉండటంతో అవి మన దేశీయ మార్కెట్లపై పడుతున్నాయి. ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సమస్య వల్ల యూఎస్ టెక్ మార్కెట్లు గత శుక్రవారం తీవ్రంగా పడిపోయాయి. దీంతో యూఎస్ సూచీలు నష్టాలను చవిచూశాయి. అలాగే.. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా యూఎస్ మార్కెట్లపై పడింది. అవన్నీ దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపించడంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయమే నష్టాలను చవిచూశాయి.