Tomatoes : ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం సామాన్యులు టమాటాలు కొనలేని పరిస్థితి నెలకొంది. జనాలకు టమాట తినాలనే కోరిక ఉన్నప్పటికీ కొనాలంటే మాత్రం భయపడే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం టమాట రేట్ అనేది స్టాక్ మార్కెట్ మరియు బంగారు రెట్ల ను మించి వేరియేషన్స్ చూపిస్తూ దూసుకెళ్తుంది. అయితే రెండు వారాల క్రితం వరకు కిలో టమోటా 25 రూపాయలు ఉండగా ప్రస్తుతం దాని ధర ఏకంగా వంద రూపాయలకు చేరుకుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్ లో టమాట సరిపడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలోనే మదనపల్లి హోల్ సేల్ మార్కెట్లో దాదాపు 80 రూపాయలకు చేరుకున్న టమాటో సెంచరీకిి సమీపంలో ఉంది. ఇక రిటైలర్ చూసుకున్నట్లయితే టమాట ఆల్రెడీ సెంచరీని పూర్తి చేసుకుంది.
అయితే వేసవికాలం వరకు కాసంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి రోజురోజుకు కూరగాయ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ధర లేదంటూ టమాటాలను రైతులు రోడ్లమీద పారబోస్తే ఇప్పుడు అదే టమాట దాదాపు కిలో 100 రూపాయలు చొప్పున పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. భారీగా పెరుగుతున్న టమాటా ధరలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ పై చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా నుంచి టమాటాలు కొనుగోలు చేసి రైతు బజార్ లో విక్రయించేందుకు ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధం అవుతున్నట్లుగా తేలుస్తోంది. పది రోజుల్లో దాదాపు 30 టన్నుల టమాటాలను కొనుగోలు చేసి వాటిని కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు.
ఈ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రతి జిల్లా అధికారి చేతిలో దాదాపు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న కూరగాయల రేట్ల దృష్ట్యా ఇకపై ఆ రేట్లు పెరగడానికి వీల్లేదని సామాన్యులకు అందుబాటు ధరలు వీటిని అందించే ప్రయత్నం చేస్తుంది ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చినాయుడు మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో కూరగాయ ధరలు ఉంచుతామని అవసరమైతే బయట నుండి తెప్పించి మరి రైతు బజార్ లో ప్రజలకు తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు.