SSC JE Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాలలో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
SSC JE Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC je నుండి విడుదల కావడం జరిగింది.
SSC JE Jobs ఖాళీలు…
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 968 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బోర్డర్ రోడ్స్ ఏజెన్సీ – 475
బ్రహ్మపుత్ర బోర్డు, జలశక్తి మంత్రిత్వ శాఖ – 02
సెంట్రల్ వాటర్ కమిషన్ – 120
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ – 338
సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ – 05
నేవీ – 06
జలశక్తి మంత్రిత్వ శాఖ – 04
NTRO – 06
SSC JE Jobs విద్యార్హత…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిప్లమా లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలుగుతారు.
ముఖ్యమైన తేదీలు…
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ 28-03-2024 నుండి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 18-04-2024.
SSC JE Jobs వయస్సు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు దరఖాస్తు చేయడానికి గరిష్టంగా 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు SC,ST లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .
SSC JE Jobs రుసుము…
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.100 రుసుము చెల్లించాలి. SC,ST మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీ వారీగా వయస్సు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఎలా అప్లై చేయాలి…
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి స్టాఫ్ రిక్రూట్మెంట్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం…
ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 జీతంగా చెల్లించబడుతుంది.
ఉద్యోగం చేయాల్సిన స్థలం..
ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి న్యూఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది.