Tirumala : తిరుమల భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు తీసుకోవచ్చు

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలను పెంచింది టీటీడీ. టీటీడీని కూడా ప్రక్షాళన చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలకు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా భక్తుల కోసం మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు భక్తుల కోసం టికెట్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

srivari darshan ticket counter at adiseshu rest house

శ్రీవాణి ట్రస్టు భక్తుల కోసం ఆదిశేషు విశ్రాంతి భవనంలో ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. దాని కోసం భక్తులు కూడా అందులోనే వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్మినెంట్ గా డీఎఫ్‌వో ఆఫీసులో శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. దాని కోసం ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు.

టీటీడీ ఇటీవలే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సామాన్య భక్తులకు ఇప్పటి వరకు తక్కువ టికెట్లు అందుబాటులో ఉండేవి. ఉదయమే అన్ని దర్శనం టోకెన్లు అయిపోయేవి. అందుకే శ్రీవాణి దర్శనం టికెట్లను రోజుకు వెయ్యికి పరిమితం చేసి ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేస్తోంది. ఆన్ లైన్ లో కేవలం 750 మాత్రమే జారీ చేస్తోంది. వీటికి అదనంగా మరో 250 టికెట్లను టీటీడీ త్వరలో జారీ చేయనుంది.

Author