Nitish Kumar Reddy : పక్కింటి ఆంటీ గొడవ వల్లనే క్రికెటర్ అయ్యాను… నితీష్ కుమార్ రెడ్డి..!

Nitish Kumar Reddy : ఐపీఎల్ 2024 IPL 2024 లో భాగంగా భారతదేశంలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్ ipl season 2024 లో అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి Nitish Kumar Reddy ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. అంతేకాక పక్కింటి ఆంటీ గొడవ చేయడం వలనే తాను క్రికెటర్ గా ఎదిగానంటూ నితీష్ కుమార్ రెడ్డి తెలపడం గమనార్హం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే….

Nitish Kumar Reddy : అంబటి రాయుడుతో కలిసి రితీష్ కుమార్ రెడ్డి..

Nitish Kumar Reddy : పక్కింటి ఆంటీ గొడవ వల్లనే క్రికెటర్ అయ్యాను... నితీష్ కుమార్ రెడ్డి..!
Nitish Kumar Reddy : పక్కింటి ఆంటీ గొడవ వల్లనే క్రికెటర్ అయ్యాను… నితీష్ కుమార్ రెడ్డి..!

అయితే ఇటీవల అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ కు నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక దీనిలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని క్రికెట్ వైపు ఎలా అడుగులు వేశావు..? ఎప్పుడు మొదలుపెట్టావు అని అంబాటి రాయుడు ప్రశ్నించగా దానికి నితీష్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…మా నాన్న జింగ్ మైదానంలోపని చేసేవారు. నేను కూడా జింక్ మైదానంలోనే నా కెరియర్ ను మొదలుపెట్టాను.మా చిన్నతనంలో వేసవి సెలవులు వచ్చాయంటే మా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ బాగా ఆడేవాడని. ఇక ఆ సమయంలో పక్కింటి ఆంటీకి మా అమ్మకు అస్సలు పడేది కాదు. నేను మాత్రం ప్రతిసారి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి బాల్ కొట్టేవాడిని. దీంతో అమ్మకు ఆంటీకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండేది. దీంతో మా అమ్మ చాలా సీరియస్ అయింది.

Nitish Kumar Reddy : నా రోల్ మోడల్ కోహ్లీ..  virat kohli

సమ్మర్ హాలిడేస్ లో ఇంటి దగ్గర ఉంటే వీడేం చేయడం లేదని ,వీడిని కూడా గ్రౌండ్ కు తీసుకువెళ్ళమని మా నాన్నకు చెప్పింది. మా నాన్న కూడా కబడ్డీ ప్లేయర్ ఆ రోజుల్లో ప్రతిరోజు గ్రౌండ్ కు వెళ్లేవారు. అలా నాన్నతో పాటు గ్రౌండ్ కి వెళ్ళటం మొదలుపెట్టాను. గ్రౌండ్ లో నా ఆట చూసిన కోచ్ బాగా ఆడుతున్నాడని కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ అవుతాడని నాన్నకు చెప్పాడు.

Nitish Kumar Reddy : పక్కింటి ఆంటీ గొడవ వల్లనే క్రికెటర్ అయ్యాను... నితీష్ కుమార్ రెడ్డి..!
Nitish Kumar Reddy : పక్కింటి ఆంటీ గొడవ వల్లనే క్రికెటర్ అయ్యాను… నితీష్ కుమార్ రెడ్డి..!

ఆ విధంగా నా మీద నమ్మకం పెట్టుకొని మా నాన్న కోచింగ్ ఇప్పించారని అలా నా కెరియర్ ప్రారంభమైంది అంటూ ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ అని ,అతనికి నేను చాలా పెద్ద అభిమానినని తెలిపారు. విరాట్ కోహ్లీ  virat kohli బ్యాటింగ్ మరియు ఆటిట్యూడ్ అంటే చాలా ఇష్టమని నితీష్ కుమార్ చెప్పారు. అలాగే క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ప్రదర్శించే తీరు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday