Solar System : సౌర కుటుంబం యొక్క అంతుచిక్కని రహస్యాలు…!

Solar System : ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీలు కూడా ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాలను తెలుసుకోవాలని భావిస్తున్నాయి. కానీ బ్రహ్మాండంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి అంటే వాటి గురించి తెలుసుకునే కొద్ది మన ముందుకు మరికొన్ని రహస్యాలు వస్తూ ఉంటాయి. ఇప్పటికే మన సౌర మండలంలో ఉన్న అన్ని గ్రహాల పైన రీసెర్చ్ చేశారు. అలాగే ఆ గ్రహాల యొక్క నేలను కూడా మనం దగ్గర నుండి చూసాం. కానీ మార్స్ గ్రహంపై తప్ప సౌర మండలంలో ఉన్న ఏ గ్రహం పైన మనం జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. అయితే అసలు ఈ సౌర మండలంలోని గ్రహాలు ఎలా ఉంటాయి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. మన సౌర మండలంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి అని మీకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక ఈ సౌర మండలంలో పెద్దదిగా సూర్యుని పరిగణిస్తారు.

Advertisement

Solar System : సూర్యుడు.

సూర్యుడు సౌర మండలంలో ఉన్న బరువులో 99.8 శాతం బరువు ఉంటాడు.అయితే సూర్యుడిపై జరిగే విస్ఫోటనాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అలాగే సూర్యున్ని మండుతున్న అగ్నిగోళం అని పిలుస్తారు. ఇక ఈ అగ్నిగోళంలో ఉన్న అంతుచిక్కని రహస్యాలను కనుగొనడం అనేది శాస్త్రవేత్తలకు సైతం చిక్కు ప్రశ్న

Advertisement
Solar System సౌర కుటుంబం యొక్క అంతుచిక్కని రహస్యాలు
Solar System సౌర కుటుంబం యొక్క అంతుచిక్కని రహస్యాలు

Solar System : మెర్క్యూరీ…

మెర్క్యూరీ గ్రహాన్ని తెలుగులో బుధ గ్రహం అంటారు. మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. ఇక ఈ మెర్క్యూరీ గ్రహాన్ని అంతరిక్ష గ్రహం క్యాప్చర్ చేసింది.మెక్యూరీ యొక్క నేల సమతుల్యంగా ఉండదు.ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అయితే సైంటిస్టులు మెర్క్యూరీ నేల మరియు చంద్రుడి నేల దాదాపు ఒకే రకంగా కనపడతాయని చెబుతుంటారు. అలాగే మెర్క్యూరీ నేలను చూసినప్పుడు చంద్రుడు నేల లాగా కనిపిస్తుంది కానీ నిజానికి అవి చాలా వేరుగా ఉన్నాయి.

Solar System : వీనస్ గ్రహం…

వీనస్ గ్రహాన్ని తెలుగులో శుక్ర గ్రహం అని అంటారు. ఇక ఈ వీనస్ గ్రహాన్ని సౌర మండలంలో ఉన్న అతి వేడి గ్రహంగా భావిస్తారు. అయితే ఈ వీనస్ యొక్క ఫోటోల ను వినేరా స్పేస్ క్యాపిటల్ క్యాప్చర్ చేసింది.

Solar System : భూమి…

భూమి మన ఇల్లు. అలాగే సైంటిస్టు ఇప్పటివరకు చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే భూమి పైన మాత్రమే మనుషులు ఉన్నారు. అంతేకాక మనుషులు జంతువులు జీవించడానికి భూమి అనువైన గ్రహంగా గుర్తించబడింది.

Solar System : మార్స్ గ్రహం…

మార్స్ గ్రహాన్ని తెలుగులో మంగళ గ్రహం అంటారు. మార్స్ గ్రహం అనేది ఒక ఎర్రటి ప్రపంచంలో ఉంటుంది. సైంటిస్టులు చాలా కాలం నుంచి మార్స్ గ్రహం పైన జీవం ఉందా అని వెతుకుతున్నారు కానీ వాళ్ళు ఇప్పటివరకు అక్కడ జీవం ఉంది అని నిరూపించలేకపోయారు.ఇప్పటివరకు మనం సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకుందాం.. అయితే ఇప్పటివరకు మనం తెలుసుకున్న గ్రహాలు అన్ని కూడా గణ గ్రహాలు. ఇక ఇప్పుడు తెలుసుకోబోయే నాలుగు గ్రహాలు కూడా వాయు గ్రహాలు. వీటిలోపల దాదాపు గ్యాస్ ఎక్కువగా ఉంటుంది.

Solar System : జుపిటర్ గ్రహం…

జుపిటర్ గ్రహం. దీన్ని తెలుగులో బృహస్పతి అని అంటారు.ఇక ఈ గ్రహంలో ఎక్కువ మొత్తంలో వాయువులు ఉండటం వలన దీనిని వాయు గ్రహంగా పిలుస్తుంటారు.

Solar System : సాటర్న్ గ్రహం.

సాటర్న్ తెలుగులో శని గ్రహం అంటారు. సౌర మండలాల్లో ఉన్న అన్ని గ్రహాల కంటే ఈ శని గ్రహం విచిత్రంగా ఉంటుంది. దానికి గల కారణం దీని చుట్టూ ఉన్న రింగ్స్. ఈ గ్రహం చుట్టూ ఉన్న రింగ్స్ మరే గ్రహానికి ఉండవు. ఈ గ్రహం కూడా జుపిటర్ గ్రహంలాగానే వాయు గ్రహం.

Solar System : యురేనస్ గ్రహం.

ఈ గ్రహాన్ని సూర్యుని నుంచి ఏడవ గ్రహంగా భావిస్తారు.ఇది కూడా ఒక వాయు గ్రహం కాని ఇందులో మంచు గడ్డలు కూడా ఉండడం వలన దీనిని ఐస్ జంట్ అని కూడా పిలుస్తారు.ఇక ఇక్కడ సూర్యుని వెలుగు అత్యంత తక్కువగా పడటం వలన చలి ఎక్కువగా ఉంటుంది

Solar System : నెప్ట్యూన్ గ్రహం.

సౌర మండలంలో ఉన్న చివరి గ్రహం నెప్ట్యూన్ గ్రహం.నెప్ట్యూన్ గ్రహం కూడా ఒక వాయు గ్రహం కాని ఈ గ్రహంలో కూడా యూరినస్ గ్రహం లాగా మంచు శాతం ఎక్కువగా ఉంటుంది.ఈ కారణం చేత దీనిని ఐస్ జెంట్ అని పిలుస్తారు.ఈ గ్రహాన్ని ఇప్పటివరకు ఒకే ఒక్క అంతరిక్ష యానం చేరుకుంది.అదే వైజాగ్ 2. మన సౌర కుటుంబంలో దీనిని ఎనిమిదవ గ్రహంగా పరిగణిస్తారు.

Solar System : ఫ్లూటో…

వాస్తవానికి మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి. వాటిలో చివరిది ఫ్లూటో. అయితే ఈ గ్రహం సూర్యునికి అత్యంత దూరంగా ఉండటం వలన చీకటిగా ఉంటుంది. అంతేకాక అత్యంత ఎక్కువ చలి కలిగిన గ్రహంగా దీనికి పేరు ఉంది. అలాగే గ్రహాలన్నింటిలో అత్యంత చిన్న గ్రహం ఫ్లూటో. కానీ ఇప్పుడు ఈ గ్రహాన్ని సౌర కుటుంబంలో భాగంగా చూపించడం లేదు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది