Sobhita Dhulipala : నాగ చైతన్య లేక‌పోవ‌డంతో దిగులుప‌డుతున్న శోభితా.. ఒంట‌రిగా ఆ ప‌ని..!

Sobhita Dhulipala : అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడు నాగ చైత‌న్య జోష్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. అయితే ఏ మాయ చేశావే సినిమా చేస్తున్న స‌మ‌యంలో స‌మంత ప్రేమ‌లో ప‌డ్డాడు చైతూ. ఇక ఇద్ద‌రు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. కాని కొన్ని కారణాల వ‌ల‌న విడిపోవ‌ల్సి వ‌చ్చింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Sobhita Dhulipala : నాగ చైతన్య లేక‌పోవ‌డంతో దిగులుప‌డుతున్న శోభితా.. ఒంట‌రిగా ఆ ప‌ని..!
Sobhita Dhulipala : నాగ చైతన్య లేక‌పోవ‌డంతో దిగులుప‌డుతున్న శోభితా.. ఒంట‌రిగా ఆ ప‌ని..!

Sobhita Dhulipala చైతూని మిస్ అవుతున్నావా..!

సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరు పార్టీలో కలిసిన ఫొటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.దీంతో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.గ‌తంలో ఓ హోటల్‌ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. ఇదిలా ఉంటే తాజాగా శోభితా వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బ్యూటీ షిప్‌లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. శోభితా ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. విరహా వేదనలో ఉన్న శోభితా నాగ చైతన్య ఎక్కడా అంటూ కొందరు పోస్టులు పెడుతుండగా, అసలు ఈ ఫొటోలు తీసిందే నాగ చైతన్య అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు

Author