Smita Sabharwal : స్వరం వణుకుతున్నా.. నిజమే మాట్లాడండి.. స్మితా సబర్వాల్ ట్వీట్ వైరల్ 

Smita Sabharwal : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్మితా సబర్వాల్, బాలలత.. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ట్వీట్ల వార్ గురించే చర్చ నడుస్తోంది. నిజానికి ఈ వార్ జరగడానికి కారణం.. స్మితా సబర్వాల్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పెద్ద సర్వీసుల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అలా ఎందుకు ఇస్తున్నారు అంటూ స్మితా సబర్వాత్ ఓ పోస్ట్ పెట్టారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేపింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి.. స్మితా సబర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.

smita Sabharwal latest tweet viral

దివ్యాంగులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ స్మితాపై సివిల్స్ కోచింగ్ ఎక్స్‌పర్ట్ బాలలత మండిపడ్డారు. తనతో ఇప్పుడు మళ్లీ సివిల్స్ పరీక్ష రాయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తన సవాల్ ను స్వీకరిస్తున్నానని స్మిత కూడా ట్వీట్ చేశారు. కానీ.. ఇప్పుడు నా వయసు ఎక్కువ. ఈ వయసులో మళ్లీ సివిల్స్ పరీక్ష రాయడానికి యూపీఎస్సీ అనుమతి ఇస్తుందా? అంటూ ప్రశ్నించారు.

ఆ తర్వాత మళ్లీ తాజాగా మరో ట్వీట్ చేశారు స్మిత. కొందరి కెరీర్ పబ్లిక్ కోసమే అయి ఉంటుంది. పబ్లిక్ కోసమే పుడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది.. మనకంటూ ఓ బలం ఉంటుంది.. అది ప్రైవసీలోనే పెంపొదడం జరుగుతుంది. అందుకే.. మీ వాయిస్ షేక్ అయినా సరే.. స్వరం వణుకుతున్నా నిజమే మాట్లాడండి అంటూ స్మితా సబర్వాల్ మళ్లీ ట్వీట్ చేశారు.

Author