Migraine : మైగ్రెన్ నొప్పి వేధిస్తోందా… అయితే ఈ విధంగా చేయండి…

Migraine : మైగ్రేన్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఉన్నవారు విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. తల మొదటి భాగం నుంచి మొదలు పెడితే తల మొత్తం కూడా నొప్పి వ్యాపిస్తుంది. ఈ నొప్పితో ఏ పని చేయలేరు. కేవలం నొప్పి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. సాధారణంగా శరీరంలో సెరోటోనిన్ రసాయన సమతుల్యత కోల్పోయినప్పుడు మైగ్రేన్ సమస్య వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా మైగ్రేన్‌లకు జన్యుపరమైన కారకాల వల్ల కూడా ఈ సమస్య వస్తుందనే నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య కావడంతో దీని నుండి బయటపడటం అంత సులభం కాదు. కానీ దీని లక్షణాలను నియంత్రంచవచ్చు. మరి అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

మైగ్రేన్ లక్షణాలు నుంచి ఉపశమనం పొందడం కోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. దీని ద్వారా తలనొప్పి తగ్గుతుంది. అయితే మైగ్రేన్ నొప్పిని నియంత్రించడం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు సరిపడా నీటిని తాగాలి. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం. ఎండలో తిరగకపోవడం మంచిది. ఇది మైగ్రేన్ సమస్య నుంచి దూరం చేస్తాయి. అలాగే ఏదైనా పనిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా తలనొప్పి మొదలైతే కొన్ని హోమ్ రెమెడీస్ సహాయాన్ని తీసుకోవచ్చు. అవేమిటంటే మైగ్రేన్ తలనొప్పి మొదలైనప్పుడు ఫోన్ చూడడం కంప్యూటర్స్ ,లైట్లు చూడడం వంటివి చేయకూడదు. అదేవిధంగా మిరియాలు, అల్లం , నిమ్మకాయతో టీ ని తయారు చేసుకొని తాగండి.

Advertisement

దీనిని తాగడం ద్వారా తలనొప్పి మంట అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ ఇవి చేయడం కుదరకపోతే వెంటనే తల మెడ మీద కోల్డ్ కంప్రెస్ చెయ్యాలి. దీని ద్వారా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. అలాగే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేసుకోవాలి. దీని ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ చిట్కాలు కేవలం తలనొప్పి తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఒక్కసారి మైగ్రేన్ తలనొప్పి వస్తే కొన్ని రోజుల పాటు అలానే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శరీరానికి సరిపడా నీటిని ఎక్కువగా త్రాగాలి. అలాగే ఈ సమయంలో శరీరానికి నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా టీ కాఫీలకు దూరంగా ఉండడం మంచిది.

Author