Sharwanand : బాల‌కృష్ణ టైటిల్‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం.. ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడే..!

Sharwanand : వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో శ‌ర్వానంద్. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు శ‌ర్వా. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో శ‌ర్వా35 గా ఓ చిత్రం రూపొందుతుంది. ఇందులో కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వ‌చ్చింది. ఇక ఈ మూవీతో అయిన శ‌ర్వానంద్ మంచి హిట్ కొడ‌తాడ‌ని అంద‌రు అనుకుంటున్నారు.అయితే తాజాగా శ‌ర్వానంద్ కొత్త మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇటీవల తన పుట్టిన రోజు నాడు వరుసగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెంచాడు.

Sharwanand : బాల‌కృష్ణ టైటిల్‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం.. ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడే..!
Sharwanand : బాల‌కృష్ణ టైటిల్‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం.. ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడే..!

ఇద్దరు హీరోయిన్స్  Sharwanand

అయితే మ‌న‌మే అనే సినిమా చేస్తున్న శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం త‌న 36,37 సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే శర్వా 37వ సినిమా ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, AK ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించి కొన్నాళ్లుగా అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. శర్వానంద్ 37వ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, మరో వైపు శర్వా తండ్రి పాత్రలో కూడా కనిపిస్తాడని జోరుగా ప్ర‌చారాలు న‌డిచాయి. అయితే ఈ సినిమాకి బాలయ్య బాబు పాత సినిమా టైటిల్ పెట్టారు. గతంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్స్ తో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.

Sharwanand : బాల‌కృష్ణ టైటిల్‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం.. ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడే..!
Sharwanand : బాల‌కృష్ణ టైటిల్‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం.. ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడే..!

ఇద్ద్దరు భామల మధ్య నలిగిపోయిన హీరోలా బాలయ్య కామెడీతో నవ్వించి తెగ సంద‌డి చేశాడు. ఇప్పుడు అదే సినిమా టైటిల్‌ని శ‌ర్వానంద్ సినిమాకి పెట్టారు. మొత్తానికి శర్వానంద్ 37వ సినిమాకి దర్శకుడు రామ్ అబ్బరాజు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ఖరారు చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా ఉండబోతున్నారు.. ఆల్రెడీ రామ్ అబ్బరాజు శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమాతో హిలేరియస్ గా నవ్వించి హిట్ కొట్ట‌డంతో ఇప్పుడు శ‌ర్వా 37వ సినిమాతో కూడా అల‌రిస్తాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి ఈ అప్‌డేట్ తో అంచ‌నాలు బాగా పెరిగాయి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday