Nellore Roti Festival : రొట్టెల పండుగ ప్రారంభం.. దర్గాకు భారీగా తరలివచ్చిన భక్తులు

Nellore Roti Festival : రొట్టెల పండుగ తెలుసు కదా. ఈ పండుగ అక్కడ చాలా ఫేమస్. మరెక్కడా ఇలాంటి పండుగను మనం చూసి ఉండం. కానీ.. నెల్లూరులో మాత్రం రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్. అక్కడి వారి సంప్రదాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ పండుగ తాజాగా ప్రారంభం అయింది. ఈ రొట్టెల పండుగ నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద జరుగుతుంది.

Advertisement

roti festival started in Nellore in Andhra Pradesh

Advertisement

దీంతో బారాషహీద్ దర్గా వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. అక్కడ ఇచ్చే రొట్టెల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకున్నారు. దర్గా దగ్గరే ఉన్న స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి కోర్కెలు తీర్చే రొట్టెలను బంధుమిత్రులతో పంచుకుంటున్నారు.

అనంతరం బారాషహీద్ దర్గాలో మొక్కులు చెల్లించి రొట్టెల పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ కోసం పోలీసులు, స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా సెక్యూరిటీని పెంచారు. 2 వేల మంది పోలీసులను ఈ పండుగ నేపథ్యంలో నియమించారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం అయిన ఈ పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది.

Author