Rishabh Pant : ప్ర‌మాదం త‌ర్వాత రెండు నెల‌లు బ్ర‌ష్ కూడా చేసుకోలేక‌పోయా.. బాధ‌లు చెప్పిన రిష‌బ్ పంత్..!

Rishabh Pant : భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ‌డం మ‌నం చూశాం. కారు ప్రమాదంలో మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చిన అతడు.. ఇప్పుడు వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టులో స్థానం ద‌క్కించుకోవ‌డం అంటే ఆషామాషీ కాదు. ఆయ‌న రికవరీ అంత సులువుగా జరిగిందేమీ కాదు. తాను చాలానే శ్రమించినట్లు పంత్ చెబుతున్నాడు. రిష‌బ్ పంత్ సుదీర్ఘ విరామం త‌రువాత మైదానంలో అడుగుపెట్టి ఐపీఎల్‌లో అద‌రగొట్టాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 155 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోనూ స్థానం సంపాదించుకున్నాడు. త‌న ఫామ్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగించాల‌ని భావిస్తున్నాడు.

Rishabh Pant భ‌యంక‌ర‌మైన పరిస్థితులు

శిఖర్ ధావన్ ఈ మధ్యే ఓ టాక్ షో ప్రారంభించ‌గా, ఈ షో ధవన్ కరేంగే పేరుతో ప్ర‌సారం అవుతుంది. జియో సినిమాలో ఈ షో వస్తోంది. ఇందులో రిషబ్ పంత్ కూడా పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ లో పంత్ తనకు జరిగిన కారు ప్రమాదం గురించి వెల్లడించాడు. తీవ్ర గాయాలతో 15 నెలలపాటు పోరాడి తిరిగి ఐపీఎల్ ద్వారా కాంపిటీటివ్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. యాక్సిడెంట్ తర్వాత తాను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో వివరించాడు. “గాయాల నుంచి కోలుకోవాలంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ చుట్టూ ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్లు ఉంటారు. కానీ మనకు ఏది మంచిదో అదే ఆలోచించాలి. ఆ ప్రమాదం నా జీవితాన్నే మార్చేసిన అనుభవం.

Rishabh Pant : ప్ర‌మాదం త‌ర్వాత రెండు నెల‌లు బ్ర‌ష్ కూడా చేసుకోలేక‌పోయా.. బాధ‌లు చెప్పిన రిష‌బ్ పంత్..!
Rishabh Pant : ప్ర‌మాదం త‌ర్వాత రెండు నెల‌లు బ్ర‌ష్ కూడా చేసుకోలేక‌పోయా.. బాధ‌లు చెప్పిన రిష‌బ్ పంత్..!

అది జరిగిన తర్వాత నేను అసలు బతుకుతానా లేదా కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ దేవుడు దయతలచి నన్ను కాపాడాడు. రెండు నెలల వరకు నేను కనీసం బ్రష్ కూడా చేసుకోలేకపోయాను. ఆరేడు నెలల వరకు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. వీల్ చెయిర్ లో ఎవరూ నన్ను చూడొద్దని నేను ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లలేదు” అని పంత్ చెప్పాడు. ఓ వ్య‌క్తిగా మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంద‌న్నాడు. త‌న‌కు ఇది పున‌ర్మ‌జ‌న్మ‌లాంటిది అని భావిస్తున్నాట్లు చెప్పాడు. క్రికెట్‌లో పున‌రాగ‌మ‌నం పై మాట్లాడుతూ ఒత్తిడి కంటే ఎక్కువ‌గా ఉత్సాహంగా ఉన్నట్లు ఆసక్తిక‌ర కామెంట్స్ చేశాడు పంత్.

Author